Citroen C3 Aircross Automated Variant Launched in India

Citroen C3: మీరు ఏదైనా మంచి కారు కోసం చూస్తున్నారా..? అయితే ఈ కారు వివరాలను చూడండి. ఈ
సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ ఆటోమేటిక్‌ వేరియంట్‌ ని రూ.12,84,800 కి కొనచ్చు. ఈ రేటు ని ప్రారంభ ధరతో సంస్థ విడుదల చేసింది. ఇక సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ ఆటోమేటిక్‌ వేరియంట్‌ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ని చూసేద్దాం. ఈ కారు డిజైన్ పరంగా ఈ మిడ్‌ సైజ్‌ SUV 4.3 మీటర్ల పొడవు తో వుంది. భారతీయ కుటుంబాలకు తగినట్లుగా దీన్ని డిజైన్ చేసారు. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌ ఆటోమేటిక్‌ వేరియంట్‌ మిడ్‌-లెవెల్‌ SUV డిజైన్ తో వుంది.

Citroen C3 Aircross Automated Variant Launched in India

బోల్డ్ సిల్హౌట్, మస్కులర్ ఫ్రంట్ ఎండ్ అలానే 200mm హై గ్రౌండ్ క్లియరెన్స్‌ ఈ కారు స్పెషల్. స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకునే 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ని కూడా సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ ఆటోమేటిక్‌ వేరియంట్‌ లో ఇచ్చారు. కొత్త 7-అంగుళాల TFT క్లస్టర్ అలానే USB ఛార్జింగ్‌ ఫీచర్ల కూడా వుంది. బూట్‌ స్పేస్‌ అయితే 511 లీటర్ల సామర్థ్యాన్ని ఇచ్చారు. లాంగ్‌ జర్నీస్‌కు కి అవసరం కనుక ఎక్కువ బూట్‌స్పేస్‌ను అందించారు.

Also Read: Budget Session 2024: నేడు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు..!

మాన్యువల్ గేర్ సెలెక్టర్ మోడ్‌ తో అధిక పనితీరు కలిగిన టార్క్ కన్వర్టర్ 6-స్పీడ్ AT తో ఈ కార్ వస్తోంది. 108.4 bhp వద్ద 205 NM టార్క్‌ని ఉత్పత్తి చేస్తుందిది. ఈ కారు పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 17.6 kmpl మైలేజ్‌ని అందిస్తుంది. ఆటోమేటిక్ వెర్షన్ రిమోట్ ఇంజిన్ స్టార్ట్ అలానే రిమోట్ AC ప్రీకాండిషనింగ్ వంటి ఫీచర్స్ ని కూడా ఇచ్చారు. భారత్‌లోని ప్రధాన నగరాల్లో నివసించే వాళ్ళు ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి నేరుగా తమ C3 ఎయిర్‌క్రాస్ SUVని ఆర్డర్ చెయ్యచ్చు. సంస్థ మీకు ఇంటి వద్దకే డెలివరీ చేస్తుంది. (Citroen C3)

Join WhatsApp