Citroen EC3 New Car Launch in Indian Market

Citroen EC3: ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేకం వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కార్స్. అత్యధిక ఫీచర్లతో, అద్భుతమైనటువంటి తో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఈవి దూసుకు వచ్చింది అదే సిట్రోయెన్ ఈసీ3. మరి ఈ వాహనం యొక్క ధర, ఇతర వివరాలు చూద్దాం. ది సిట్రోయెన్ EC3 వాహనాల నుంచి నాలుగు వెర్షన్ లు అందుబాటులోకి వచ్చాయి.

Citroen EC3 New Car Launch in Indian Market

ఇందులో ముఖ్యంగా షైన్ వైబ్ ప్యాక్, షైన్, షైన్ డ్యూయల్ టోన్, షైన్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ ఇలా నాలుగు వెర్షన్లలో వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక వీటి ధరలు రూ:13.19లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇదే తరుణంలో సిట్రోయెన్ ఈసీ3 షైన్ లో ఫ్రంట్, 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ , ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓవిఆర్ఎంలు, లెదర్ ర్యాంపుడ్ స్టీరింగ్ విల్, రియర్ వై ఫర్, రియర్ డిఫాగర్, అంతేకాకుండా రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: Hero Karizma CE001: అదిరే ఫీచర్స్ తో.. హీరో మోటోకార్ప్‌ నుంచి కరిజ్మా CE స్పెషల్‌ ఎడిషన్‌…!

అంతేకాకుండా ఈ 56.22 బిహెచ్ ఫీ,143 ఎన్ ఎం టార్కు ఉత్పత్తి చేసే పర్మనెంట్ మాగ్నైట్ సిక్రోనస్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. అంతేకాకుండా ఈ వాహనం గరిష్టంగా 107 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. 6.8 సెకండ్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోగలరు. ఇక ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 320 కిలోమీటర్ల మైలేజ్ తో దూసుకుపోతుంది.

Citroen EC3: New car launch in Indian market

ఇక డిసి ఫాస్ట్ చార్జర్ తో 57 నిమిషాల్లో జీరో నుంచి 80% చార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 315 లీటర్ల బూటు స్పేస్ కలిగి ఉంది. ఇక ఈ వాహనాలు అనేక రంగులలో మనకు లభిస్తున్నాయి. ప్లాటినం గ్రే, పోలార్ వైట్, కాస్మో బ్లూ, స్టీల్ గ్రే, అంతేకాకుండా పోలార్ వైట్ విత్ ప్లాటినం గ్రే రూఫ్, స్టీల్ గ్రే విత్ ప్లాటినం గ్రే రూఫ్, స్టీల్ గ్రే విత్ పోలార్ వైట్ రూఫ్, ఇంకా రకరకాల కలర్స్ లో ఈ వాహనం మనకు లభిస్తున్నది.(Citroen EC3)

Join WhatsApp