Convertible Batmobile like scooter cum rickshaw Hero's Surge S32 EV unveiled

Hero Surge S32 Convertible : మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల టూ వీలర్ వెహికల్స్ అలాగే ఫోర్ వీలర్ వెహికల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే మార్కెట్లోకి సరికొత్త వాహనం వచ్చింది. ఆటో గా అలాగే స్కూటర్ గా మనం వాడుకునేలా సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకువచ్చింది హీరో మోటో కార్ప్ కంపెనీ.

Convertible Batmobile like scooter cum rickshaw Hero’s Surge S32 EV unveiled

ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది హీరో మోటో కార్ప్ టాప్ కంపెనీ. అయితే మనం ఆటోగా వాడుకోవాలని ఉంటే… బైక్ బాగాన ముందు జాయింట్ చేయాలి. ఒకవేళ ఓన్లీ బైక్ వాడాలనుకుంటే… ఆ జాయింట్ తీసేసి బైక్గా వాడుకోవచ్చు. ఇది పైన ఉన్న ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఆటో త్రీ వీలర్ కావడం విశేషం.

Also Read: Ola: హైదరాబాద్ లో ఓలా E-Bike టాక్సీ సేవలు.. ధర వివరాలు ఇవే

సర్జ్ S 32 పేరుతో ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. స్వయం ఉపాధి పొందే వారికోసం ప్రత్యేకంగా ఈ వాహనాన్ని రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఏదైనా సామాన్లు మోసుకుపోవడానికి ఆటోను వాడుకోవచ్చు మనం. ఇక చిన్న చిన్న పర్సనల్ అవసరాల కోసం బైక్ వాడుకోవచ్చు. అలాగే ఈ వాహనం ఎలక్ట్రిక్ కావడం మనకు కలిసొచ్చే అంశం.

ఇక ఈ బైక్ మరియు త్రి వీలర్ వాహనానికి వేరువేరు సామర్థ్యాలు ఉన్నాయి. త్రీ వీలర్ ఆటో 10 కిలోల ఇంజన్, 11 కిలోల బ్యాటరీ ఇచ్చారు. ఇక స్కూటర్ కు మూడు కిలోల ఇంజన్, 3.5 కిలో వాట్స్ బ్యాటరీ అందిస్తున్నారు. ఈ వాహనం 60 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. త్వరలోనే మార్కెట్లోకి కూడా విడుదల కాబోతోంది. (Hero Surge S32)

Join WhatsApp