E Sprinto launches high-speed e-scooter Amery

E- Scooter: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు విపరీతంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను చాలామంది కొనుగోలు చేస్తున్నారు. మన ఇండియా వ్యాప్తంగా గత మూడు సంవత్సరాలుగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.E- Scooter

E Sprinto launches high-speed e-scooter Amery

ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు మాత్రమే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే… వాహనాల కంపెనీలు… కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. ఒక దానికి మించి మరొక ఎలక్ట్రిక్ బైక్స్ లేదా కార్స్ వస్తున్నాయి. అయితే ఈ స్ప్రింట్ అమెరీ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది.E- Scooter

Also Read: Car News: 2024లో రాబోతున్న ఎలక్ట్రానిక్ SUV మోడల్స్ ఇవే !

ఈ బైక్ ను స్టార్ట్ అప్ కంపెనీ రిలీజ్ చేసింది. ఈ బైక్ ధర 1.20 లక్షల రూపాయలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. ఈ బైకులలో వైట్, ఎల్లో అలాగే మ్యాట్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. ఈ బైక్ హైవే పైన గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ఈ బైకుకు 2.5 kwh సామర్థ్యం ఉన్న మోటార్ బిగించారు. ఈ బైక్ పికప్ కూడా బాగానే ఉంటుంది. ఒకసారి మనం ఫుల్ చార్జింగ్ పెడితే 140 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.E- Scooter

అంతేకాకుండా ఈ స్కూటర్ బ్యాటరీ ఒకసారి ఫుల్ చార్జింగ్ కావాలంటే ఐదు గంటల సమయం పడుతుందట. అంతేకాకుండా ఇందులో లిథియం అయాన్ అనే బ్యాటరీ ఉంటుంది. ఇక ఈ మధ్య రిలీజ్‌ అయిన ఎలక్ట్రిక్‌ వాహనాల కంటే.. ఈ స్ప్రింట్ అమెరీ చాలా లుకింగ్‌ ఉంటుంది. పికప్‌ కూడా చాలా బాగుంటుంది. ఇక ఎందుకు అలస్యం.. వెంటనే ఈ స్ప్రింట్ అమెరీ కొనుగోలు చేసేయండని కంపెనీ సూచనలు చేస్తోంది.

Join WhatsApp