Explore the Features of Hero Karizma CE001 Special Edition

Hero Karizma CE001: మంచి బైక్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ బైక్ వివరాలు చూడాల్సిందే. హీరో మోటోకార్ప్‌ నుంచి తాజాగా హీరో వరల్డ్‌ 2024 ఇంకో బైక్‌ ని తీసుకు వచ్చింది. భారత మార్కెట్లో కరిజ్మా CE ను ప్రత్యేక ఎడిషన్‌గా తీసుకు రావడం జరిగింది. ఇక వివరాలు చూస్తే.. ఈ బైక్‌ను పరిమిత సంఖ్యలో మాత్రమే తీసుకు వస్తున్నారు. కరిజ్మా XMR హీరో మోటోకార్ప్ ముఖ్యమైన మోడళ్లలో ఒకటి. హీరో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ద్వారా హీరో మోటోకార్ప్‌ ఈ బైక్ ని తీసుకు వచ్చింది. హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ 100వ జన్నదినము సందర్భం గా ఈ ఎడిషన్‌ను రూపొందించి ప్రారంభించింది.

Explore the Features of Hero Karizma CE001 Special Edition

దాదాపు 100 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతాయి. ఇవి జూలై నెలలో కొనుగోలు చేయడానికి వస్తాయి. స్పెషల్ ఎడిషన్‌కు, రెగ్యులర్ ఎడిషన్ కరిష్మాకు పెద్దగా తేడాలు అయితే లేవు. క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్ అందించలేదు. కరిష్మా XMR క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్‌ తో వుంది. 210 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్ ఉపయోగించారు. గరిష్ఠంగా 25.5 PS శక్తిని మరియు 20.4 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Also Read: Niharika: ఆ ఒక్క మాటతో పవన్ పరువుని గంగలో కలిపేసిన నిహారిక..!

గరిష్ఠంగా 25.5 PS శక్తిని మరియు 20.4 Nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ముందు చక్రంలో 300 mm డిస్క్, వెనుక చక్రంలో 230 mm డిస్క్ ఉన్నాయి. .హజార్డ్ స్విచ్, బ్యాక్-లైట్ స్విచ్ గేర్, LED టైల్‌లైట్, LED టర్న్ ఇండికేటర్లు వున్నాయి. స్క్రీన్ నావిగేషన్, గేర్ పొజిషన్, ట్రిప్ మీటర్ మరియు మైలేజ్‌ గురించి పూర్తి వివరాలను ఇది తెలుపుతుంది. స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. (Hero Karizma CE001)

Explore the Features of Hero Karizma CE001 Special Edition
Join WhatsApp