Felo Tooz Electric Motorcycle 720km Range Power Your Adventures

Feelo Tooz EV Bike: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి చేతిలో ఎలక్ట్రిక్ వాహనం కచ్చితంగా ఉంటోంది. కాలుష్యం తగ్గించడానికి అలాగే పెట్రోల్ ధరలను తట్టుకోలేక కొంతమంది… ఏదో ఒక కారణం చేత ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇతర స్కీమ్ లో ఇవ్వడంతో ఎక్కువ శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. Feelo Tooz EV Bike

Felo Tooz Electric Motorcycle 720km Range Power Your Adventures

దేశవ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే వంద రూపాయలు దాటిన సంగతి తెలిసిందే. దీని కారణంగా కూడా చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతున్నారు. అయితే… ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లోకి మరో సరికొత్త బైక్ రాబోతుంది. ఇది కూడా ఎలక్ట్రిక్ వాహనం కావడం విశేషం. టూజ్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్ ల కంపెనీ కొత్త బైక్ ను తీసుకురాబోతుంది. Feelo Tooz EV Bike

Also Read: BMW: సింగిల్‌ చార్జింగ్‌తో 516 KM.. BMW సరికొత్త మాడల్‌

ఇక ఈ టూజ్ బైక్ ఫీచర్స్ అలాగే ధర వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. వాస్తవానికి ఈ టూజ్ ధర భారీగానే ఉంటుంది. ఈ బైక్ ధర నాలుగు నుంచి ఐదు లక్షల మధ్యలో ఉండే ఛాన్స్ ఉందట. అంతేకాకుండా ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే ఈ బైక్ 725 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంట. అలాగే ఈ బైక్ గంటకు 2500 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుందని చెబుతున్నారు. Feelo Tooz EV Bike

ఇక ఈ బైక్ డిజైన్ విషయానికి వస్తే… నార్మల్ బైక్ లాగా కాకుండా చాలా విభిన్నంగా ఉంటుంది. ఎ ఇతర బైక్ కూడా ఈ డిజైన్ లాగా ఉండదు. అయితే ఈ బైక్ను 2024 సంవత్సరం చివర్లో రిలీజ్ చేయబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ రానుందని సమాచారం.Feelo Tooz EV Bike

Join WhatsApp