Fujiyama EV Classic Scooter Launch

Fujiyama Classic: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి వాహనాల తయారీ కంపెనీలు… తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. Fujiyama Classic

Fujiyama EV Classic Scooter Launch 120 km mileage

ఇండియా వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో అందరూ ఎలక్ట్రిక్ వాహనాలని జోరుగా కొంటున్నారు. ధరతో సంబంధం లేకుండా ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇండియాలో కొత్తగా ఓ బైక్ లాంచ్ అయింది. ఆ బైక్ పేరు ఫుజియమా క్లాసిక్ ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్ కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. Fujiyama Classic

Also Read: Audi Electric Car: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 625 కిమీ

అలాగే తక్కువ ధరలు ఈ బైక్ మనకు లభిస్తుంది. ఎక్స్ షోరూం ధర ప్రకారం 80 వేల రూపాయలకు ఫుజియమా క్లాసిక్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోడు చేయవచ్చు. ఇక ముందుగా 2000 రూపాయలు చదివించి ప్రీ బుకింగ్ చేసుకోవాలి. కంపెనీ సైట్ ప్రకారం దేశ వ్యాప్తంగా 55 మంది ప్రత్యేక డీలర్లు ఉన్నారు. అలాగే 115 సర్వీస్ పాయింట్స్ కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి. Fujiyama Classic

ఇందులో 3000 వాట్ పీక్ పవర్ మోటర్ ఉంటుంది. ఇక ఈ బైక్ ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 120 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ బైక్ ఫుల్ ఛార్జింగ్ కావాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ 60 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. రాత్రి వేళల్లో మెరుగైన విజిబిలిటీ కోసం మనకు ఎల్ఈడీ లైట్లు అందిస్తోంది కంపెనీ. Fujiyama Classic

Join WhatsApp