Gemopai Electric Scooter price and features

Gemopai Electric Scooter: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఎలక్ట్రిక్ వెహికల్ తప్ప మరొక వెహికల్ కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో… అందరూ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. Gemopai Electric Scooter

Gemopai Electric Scooter price and features

దీనికి తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు రకరకాల వెహికల్స్ ను లాంచ్ చేస్తున్నాయి. అయితే తాజాగా Gemopai ఎలక్ట్రిక్ స్కూటర్ల పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది కంపెనీ. Gemopai కంపెనీకి చెందిన ఆస్ట్రిడ్ లైట్, రైడర్, రైడర్ సూపర్ మాక్స్ మోడల్ స్కూటర్ ల పై ఆఫర్ ప్రకటించారు. వాటి ధరలను కాస్త తగ్గించారు. వాటి వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే… ఆస్ట్రేడ్ లైట్ స్కూటర్ 1.11 లక్షలు గా ఉండేది. అయితే ఆ ధరను దాదాపు పదివేల రూపాయలు తగ్గించారు.Gemopai Electric Scooter

Also Read: Yamaha Aerox: యమహా నుంచి కీలెస్ స్కూటర్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలు ఇవే!

దీంతో ఎప్పుడు ఈ స్కూటర్ 99 వేల రూపాయలకు మనకు వస్తోంది. అంతేకాకుండా ఈ స్కూటర్ ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 2500 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మూడు సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది ఆస్ట్రేడ్ స్కూటర్. ఇక రైడర్ సూపర్ మాక్స్ స్కూటర్ విషయానికి వస్తే దీని ధర 80 వేల రూపాయలు ఉండేది. అయితే దీనిపై పదివేల రూపాయల ను తగ్గించారు. Gemopai Electric Scooter

దీంతో ఈ స్కూటర్ 69 వేల రూపాయలకు మనకు వస్తోంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. ఇక రైడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే దీని ధర 70 వేల రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు 59 వేల రూపాయలకు ఫిక్స్ చేశారు. అంతేకాకుండా దీనిపై మరింత కాష్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ స్కూటర్ ఫుల్ చార్జింగ్ పెడితే 120 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. Gemopai Electric Scooter

Join WhatsApp