Greaves Eltra City: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఇండియా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం. ఇండియా వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ రెండింటి ధరలు వంద రూపాయలు దాటిపోయాయి. కొన్నిచోట్ల 120 రూపాయలు కూడా ఉంది. Greaves Eltra City

Greaves Electric launches Eltra City electric autorickshaw rate and features

ఇలాంటి నేపథ్యంలోనే చాలామంది ఎలక్ట్రానిక్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే తాజాగా మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో వచ్చింది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ బైక్స్ మరియు కార్లు విపరీతంగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఆటోడ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోను లాంచ్ చేసింది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గ్రీవ్స్ అల్ట్రా కార్గో. Greaves Eltra City

Also Read: Volkswagen Id 3: ఈవీ రంగంలోకి వోక్స్‌వ్యాగన్ ఎంట్రీ.. సూపర్ మైలెజ్‌తో స్టన్నింగ్ కారు రిలీజ్

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గ్రీవ్స్ అల్ట్రా కార్గో… లాంచ్ చేసిన ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో లో 10.8 కెడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఈ ఆటోలో 6.2 అంగుళాల డిజిటల్ క్లస్టర్ కూడా వస్తుంది. అంతేకాకుండా వినియోగదారులకు నావిగేషన్ అసిస్టం అద్భుతంగా చూపిస్తుంది. భద్రత విషయంలో కూడా ఈ ఎలక్ట్రిక్ ఆటో ఎంతో మంచిదని చెబుతున్నారు కంపెనీ ప్రతినిధులు. Greaves Eltra City

ఇక గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గ్రీవ్స్ అల్ట్రా కార్గో లాంచ్ చేసిన ఈ ఆటో ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 160 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. మూడు గంటల్లో ఈ ఆటో ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గ్రీవ్స్ అల్ట్రా కార్గో లంచ్ చేసిన ఈ ఆటో ధర విషయానికి వస్తే… ఎక్స్ షోరూం ధర ప్రకారం ఈ ఆటో ద్వారా 3.70 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. Greaves Eltra City

Join WhatsApp