Hero Mavrick 440 Unveiled in India

Hero Maverick 440: మన ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. సరికొత్త కార్లు అలాగే టూ వీలర్ వెహికల్స్ కూడా దిగుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వాహనాలు ఎక్కువగా మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడంతో… ఎక్కువగా ఎలక్ట్రానిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తిని చూపిస్తున్నారు.

Hero Maverick 440 Unveiled in India

అయితే ఇలాంటి నేపథ్యంలోనే హీరో మోటో కార్ప్ కంపెనీ నుంచి అదిరిపోయే బైక్ వచ్చింది. ఎన్నో రోజులుగా లంచ్ చేయబోతున్నట్లు చెప్పిన హీరో మేవ్రిక్ 400 బైక్ ను… తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది హీరో మోటో కార్ప్. హీరో వరల్డ్ పేరుతో నిర్వహించిన వేడుకలో ఈ కొత్త బైక్ లాంచ్ చేసింది హీరో కంపెనీ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది హీరో కంపెనీ. అయితే ఇప్పటివరకు హీరో మోటో కార్ప్ నుంచి విడుదలైన బైక్లలో ఇదే ఖరీదైన బైక్ కావడం విశేషం.

Also Read: Hero Vida V1 Pro: హీరో విదా వీ1 ప్రోపై డిస్కౌంట్‌.. ఏకంగా 24 వేలు!

మరి లేటెస్ట్ గా రిలీజ్ అయిన…హీరో మేవ్రిక్ 400 బైక్ ధర మరియు ఫీచర్స్ ఇప్పుడు పరిశీలిద్దాం. హీరో మేవ్రిక్ 400 బైక్ ధర వచ్చేసి…. 2.49 లక్షలు. ఇది ఎక్స్ షోరూం ధర ప్రకారం మాత్రమే. ఇక ఈ బైక్ బుకింగ్స్ ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్నాయి. అలాగే ఏప్రిల్ నెల నుంచి డెలివరీలు కూడా ప్రారంభిస్తుంది హీరో కంపెనీ.

హీరో మేవ్రిక్ 400 బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే… ఈ బైకు 440 సిసి ఆయిల్ కూల్ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో పని చేస్తుంది. ఇందులో ఆరు స్పీడ్ గేర్ బాక్స్ లు ఉంటాయి. ఈ బైక్ పెట్రోల్ తో పనిచేస్తుంది. అంతేకాకుండా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా బ్లూటూత్ కనెక్టివిటీ అనేక ఆప్షన్స్ మనకు ఈ బైక్ లో ఉన్నాయి. (Hero Maverick 440)

Join WhatsApp