Hero MotoCorp Offering Huge Discounts on Vida V1 Pro Electric Scooter

Vida V1 Pro: మన ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు విపరీతంగా వస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు అనేక రకాల ఆఫర్లు ప్రకటించి మరి… తమ విక్రయాలను పెంచుకుంటున్నారు.

Hero MotoCorp Offering Huge Discounts on Vida V1 Pro Electric Scooter

ఇలాంటి నేపథ్యంలోని హీరో మోటో కార్ప్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ కంపెనీ ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ కంపెనీ నుంచి లాంచ్ అయిన విదా వీ 1 ప్రో ఎలక్ట్రానిక్ బైక్ విపరీతంగా సేల్ అవుతుంది. బంపర్ ఆఫర్ ప్రకటించింది హీరో మోటో కార్ప్. ఈ విదా వీ 1 ప్రో ఎలక్ట్రానిక్ బైక్ పై ఏకంగా 24000 రూపాయలు డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ.

Also Read: Mahindra: మహీంద్రా నుంచి రెండు ఎలక్ట్రిక్ కార్లు..అతి తక్కువ ధరకే !

అయితే ఈ డిస్కౌంట్ వివిధ రూపాలలో అందిస్తోంది. విదా వీ 1 ప్రో ఎలక్ట్రానిక్ బైక్ కొనుగోలు చేసే వారికి 2500 రూపాయల నగదు డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే 6600 రూపాయల ఈ అమ్మాయి బెనిఫిట్ ఉంటుంది. అంతేకాకుండా బ్యాటరీ వారంటీ పొడగింపు పై 50% డిస్కౌంట్ మరియు ఎక్స్చేంజి బోనస్ 2500 డిస్కౌంట్ మనకు అందిస్తోంది కంపెనీ.

Hero MotoCorp Offering Huge Discounts on Vida V1 Pro Electric Scooter

ఇక హీరో కంపెనీ కస్టమర్లకు లాయాల్టీ బోనస్ కింద 5000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాను కంపెనీ. అంతేకాకుండా కార్పొరేటర్ డిస్కౌంట్ కింద ₹2500 అందిస్తున్నారు. 1125 రూపాయల విలువైన ఉచిత సంస్క్రిప్షన్ ప్లాన్ కూడా అందిస్తోంది కంపెనీ. వాస్తవానికి ఢిల్లీ ధరల ప్రకారం చూస్తే ఈ స్కూటర్ ధర 1.25 లక్షలు గా ఉంది. ఇతర ప్రాంతాలలో 1.45 లక్షలు ఉంది. ఇక ప్రతి బైక్ పై 24 వేల డిస్కౌంట్ కంపెనీస్తోంది కాబట్టి బైక్ ధర తగ్గే ఛాన్స్ గా ఉంటుంది. జనవరి చివరి వరకు ఈ ఆఫర్ కొనసాగే ఛాన్స్ ఉంది. (Vida V1 Pro)

Join WhatsApp