Kia Carens : ఆటో మొబైల్ సంస్థ కియా మోటార్స్ ఇండియా లో ఉన్న బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లో కియా క్యారెన్స్ ఒకటి .ఈ ఎంపీవిపి కి సంబంధించి గ్లోబల్ ఎంసీఏపీ క్రాస్ టెస్టులు ఫలితాలు తాజాగా వచ్చాయి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాము. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ చైల్డ్​ ప్రొటెక్షన్​ విభాగం లో కియా క్యారెన్స్ ​కి 5 స్టార్​ రేటింగ్​ ని ఇచ్చారు. అడల్ట్​ ప్రొటెక్షన్​లో 3 స్టార్​ రేటింగ్​ ఈ కారు కి వచ్చింది. అయితే కియా క్యారెన్స్ ​ని రెండుసార్లు టెస్ట్​ చేసారు. ముందు టెస్ట్​ చేసినప్పుడు, అడల్ట్​ ప్రొటెక్షన్​లో ఈ ఎంపీవీకి 0 రేటింగ్​ రావడం దీనికి రీజన్ అని చెప్పవచ్చు. 2023 మే నుంచి 2023 డిసెంబర్​ దాకా తయారన యూనిట్స్​కి 0 స్టార్​ రేటింగ్​ ని ఇచ్చారు. ఆ తర్వాత తయారైన యూనిట్​లకు అయితే 3 స్టార్​ రేటింగ్​ ని ఇచ్చారు. క్యారెన్స్ ​లో కాస్త సేఫ్టీ ఫీచర్స్​ని యాడ్ చేసారు. అదే కారణం.

Kia Carens got only three stars

గ్లోబల్​ ఎన్​సీపీ క్రాష్​ టెస్ట్​కు వెళ్లిన కియా క్యారెన్స్​ ఎంపీవీ లో ఫ్రెంట్​ ఎయిర్​బ్యాగ్స్​ ని ఇచ్చారు. బెల్ట్​- ప్రిటెషనర్స్​, బెల్ట్​ లోడ్​ లిమిటర్స్​ ని ఇచ్చారు. అలానే సైడ్​ హెడ్​ కర్టైన ఎయిర్​బ్యాగ్స్​, ఐఎస్​ఓఎఫ్​ఐఎక్స్​ చైల్డ్​ సీట్​ మౌంట్స్​ కూడా ఇచ్చారు. కియా క్యారెన్స్​ గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ ప్రకారం చూస్తే.. డ్రైవర్​, ప్యాసింజర్​ హెడ్​కి సంబంధించిన ఫ్రెంటల్​ ఇంపాక్ట్​ ఉంది.

Also read: WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక నుండి ఈ సూపర్ ఫీచర్..!

అదైతే బానే ఉంది. కానీ డ్రైవర్​ మెడకు అందిన ప్రొటెక్షన్​ సరిపోలేదు. డ్రైవర్​, ప్యాసింజర్​ మోకాళ్ల రక్షణ సో సోగానే ఉంది. బాడీషెల్​ అన్​స్టేబుల్​గా ఉంది. లోడ్​ పడితే భరించడం కష్టము. హోండాకు చెందిన హోండా అమేజ్​ దారుణంగా ఉంది. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఈ వెహికిల్​కి 2 స్టార్​ రేటింగ్​ ని ఇచ్చారు. చైల్డ్​ ప్రొటెక్షన్​ టెస్ట్ ​లో దారుణంగా విఫలం అయ్యింది. అడల్ట్​ ప్రొటెక్షన్​ విభాగం కూడా సో స్లోగనే ఉంది. 5ఏళ్ల క్రితం ఇదే మోడల్​ని గ్లోబల్​ ఎన్​సీఏపీ టెస్ట్​ చేయగా అప్పుడు 4 స్టార్​ రేటింగ్​ వచ్చింది (Kia Carens).

Join WhatsApp