komaki Dual Battery EV Scooter Company Launched SE and LY

Komaki Electric Scooters: ఇండియన్ మార్కెట్ లో అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు కనిపిస్తున్నాయి. గత మూడు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు జనాలు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పోటీ నెలకొంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. Komaki Electric Scooters

komaki Dual Battery EV Scooter bike with a double battery.. 200 km on a single charge

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో కొంతమంది స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనేస్తున్నారు. సామాన్యులకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటు ధరలో ఉంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విపరీతంగా పెరిగిపోయాయి. అటు టూ వీలర్ వెహికల్ ఏ కాకుండా కార్లు కూడా ఎలక్ట్రానిక్ వాటికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు జనాలు. Komaki Electric Scooters

Also Read: Fujiyama Classic: అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్‌ బైక్‌..120 కిలో మీటర్ల మైలేజీ..ధర ఎంతంటే ?

అయితే తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కోమాకి కంపెనీ… డబుల్ బ్యాటరీ తో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ను రిలీజ్ చేసింది. ఎస్ఈ, ఎల్ వై పేరుతో ఈ స్కూటర్లను లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ స్కూటర్లలో కేవలం ఒక్క బ్యాటరీ ఉండేలా ప్లాన్ చేశారు. ఆ తర్వాత హై మోడల్ స్కూటర్లను డబుల్ బ్యాటరీ వచ్చేలా రూపొందించారు. ఎస్ఈ బేస్ మోడల్ స్కూటర్ లో ఒక బ్యాటరీ ఇచ్చి… దీని రేటు 97 వేల రూపాయల వరకు ఫిక్స్ చేశారు. ఇక ఈ బైకు 80 నుంచి 100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. Komaki Electric Scooters

ఇక రెండు బ్యాటరీలు ఉన్న స్కూటర్ ధర 1.19 లక్షలు గా ఫిక్స్ చేశారు. ఈ బైక్ ఒకసారి ఛార్జింగ్ పెడితే 140 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎస్ఈ డ్యూయల్ ప్రో బైక్లలో రెండు బ్యాటరీలు వస్తాయి. ఈ బైక్ ధర 1.28 లక్షలు గా ఫిక్స్ చేశారు. ఈ బైకు 200 కిలోమీటర్ల మైలేజ్ కూడా ఇస్తుంది. ఎల్ వై మోడల్ బేస్ వేరియంట్ బైక్ ధర 78 వేల రూపాయలుగా ఉంది. ఇక ఈ బైక్ 80 నుంచి 100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ లలో టాప్ మోడల్ లక్ష రూపాయలకు పైన ఉంటుంది. ఈ బైక్ కూడా 200 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. Komaki Electric Scooters

Join WhatsApp