Luggage Scooter: ప్రయాణ సమయంలో లగేజీ మోసే విషయంలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మనం మన సామాన్ల మీద కూర్చుని నడవాల్సిన అవసరం లేకుండా చుట్టూ తిరగచ్చు. మీ సామాను స్కూటర్ గా మారుతుందని మీకు చెప్తే నిజంగా షాక్ అవుతారు. లగేజ్ కి సంబంధించి స్మార్ట్ టెక్నాలజీ ని అరిష్ట వాల్ట్ సంస్థ తీసుకొచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్ళిపోదాం… ఈరోజుల్లో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ కారణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త పరికరాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి ఇక ఈ లగేజీ స్కూటర్కి సంబంధించి మరిన్ని వివరాలను చూసేద్దాము.

Luggage Scooter which changes

లగేజీకి సంబంధించి ఈ స్మార్ట్ టెక్నాలజీని అరిస్టా వాల్ట్ సంస్థ తీసుకు వచ్చింది. ఈ కంపెనీ 2017 నుంచి విస్తృతమైన సాంకేతికతను ఉపయోగించే ఉత్పత్తులను చేస్తూ వస్తోంది. ఎవరైనా లగేజీపై కూర్చుంటే అవే మనల్ని తీసుకుని వెళ్తాయి. అల్ట్రాసోనిక్ సౌండ్‌తో పని చేస్తుంది. కూర్చున్న వెంటనే సామాను దిగువన ఉన్న ఫుట్ రెస్ట్ ఓపెన్ అవుతుంది. మీ పాదాలను అక్కడ ఉంచి రిమోట్ ద్వారా మీరు ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్లవచ్చు. స్మార్ట్ లగేజ్-కమ్-స్కూటర్ గంటకు 7 నుండి 10 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. మీ పాదాలతో లగేజీ బ్యాగ్ దిశను మార్చవచ్చు. మీరు 120 కిలోలు లేదా అంతకంటే తక్కువ బరువు ఉంటే దాని మీద కూర్చోవచ్చు.

Also read: Venkatesh: వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ పై ఘోరంగా మండిపడ్డ జానీ మాస్టర్… కొట్టేందుకు కూడా సిద్ధపడ్డాడుగా..!

తొలగించే బ్యాటరీతో శక్తిని పొందుతుంది. రెండు గంటల్లో సులభంగా ఛార్జ్ చేయబడుతుంది. విమానాశ్రయాల్లో ఈజీ గా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరకి వెళ్ళచ్చు. ఈ గ్యాడ్జెట్ ధర రూ.50,000 నుంచి రూ.60,000. ఈ లగేజ్ బ్యాగ్ అరిస్టా వాల్ట్ అధికారిక వెబ్‌సైట్‌ తో పాటు గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇతర ఇ-కామర్స్ సైట్‌లలో కూడా అందుబాటులో ఉంది (Luggage Scooter).

Join WhatsApp