Hyundai Creta: The car that is rushing in the market

Manual car driving tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కారు ని మెయింటైన్ చేస్తున్నారు. కొత్త కొత్త మోడల్స్ వస్తే కూడా కారులని మారుస్తున్నారు. అయితే చాలామంది మాన్యువల్ కారుని నడుపుతుంటారు అయితే మాన్యువల్ కారు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆటోమేటిక్ కార్ల కన్నా మాన్యువల్ కార్ డ్రైవింగ్ కొంచెం కష్టం. ఈ నేపథ్యంలో కొన్ని తప్పులు చేయకూడదు మరి మాన్యువల్ కార్ నడిపే వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. చాలా మంది డ్రైవింగ్ నేర్చుకుని కారు కొంటారు. ఆ తర్వాత నెమ్మదిగా డ్రైవింగ్ అలవాటు చేసుకుంటూ ఉంటారు డ్రైవింగ్ మీద పట్టు ఉన్న లేకపోయినా ఈ విషయాలన్నీ కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే కారు తొందరగా పాడయ్యే అవకాశం ఉంది మాన్యువల్ కార్ వాడుతున్నప్పుడు చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడే చూసేద్దాం.

Manual car driving tips

గేర్ షిఫ్టర్ పై చేతులు ఉంచితే ట్రాన్స్మిషన్ సిస్టం వేర్ అండ్ టెర్ కి గురవుతుంది ఇదే జరిగితే రిపేర్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. గేర్ మారుస్తున్నప్పుడే గేర్ షిఫ్టర్ పై చేతులు వేయాలి అవసరం లేనప్పుడు తీసేయాలి. అలానే క్లచ్ ని ఉపయోగించినప్పుడే పెడల్ పై కాలు పెట్టాలి అనవసరంగా క్లచ్ పెడల్ పై కాలు పెడితే అది వేర్ అండ్ టెర్ కి గురవుతుంది లైఫ్ స్పాన్ తగ్గుతుంది క్లచ్ ఓవర్ హీట్ కూడా అయ్యే అవకాశం ఉంది. గేర్లని మారుస్తున్నప్పుడు క్లచ్ పెడల్ ని పూర్తిగా రిలీజ్ చేసి ఉంచాలి. ఆ తర్వాత మీ కాలుని కారు ఫ్లోర్ పై పెట్టాలి ఆటోమేటిక్ కార్ని నడపడం కన్నా మాన్యువల్ వాహనాల్ని నడపడమే కష్టం ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా గేర్లు మారుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి క్లచ్ ని ఫుల్ గా ప్రెస్ చేసిన తర్వాత గేర్ ని మార్చాలి. చాలామంది ఇలా చేయరు. ఇది తప్పు.

Also read: Modi Government: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మోడీ వైపు చూస్తున్నారు…!

ఇలా చేస్తే ట్రాన్స్మిషన్ సమయంలో గ్రైండింగ్ నాయిస్ కలుగుతుంది ఫలితంగా గేర్ బాక్స్ దెబ్బతింటుంది. గేర్ బాక్స్ ని మళ్ళి రిపేర్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చవుతుంది బండి ఆగి ఉన్నప్పుడు ఒక్కసారి చాలా గట్టిగా ఎక్సలరేషన్ ఇస్తారు అది భారీ శబ్దాన్ని ఇస్తుంది ఆ సౌండ్ విని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ అసలు ఇలా చేయకూడదు. స్పీడ్ పెంచేందుకు గేర్ మార్చి ఎక్సలరేషన్ ఇవ్వాలి తగ్గించేందుకు గేర్ మారుస్తూ బ్రేక్ వేయాలి కొంతమంది స్పీడ్ ని తగ్గించేందుకు బ్రేక్ బదులు గేర్ ని తగ్గిస్తారు ఇది మంచి డ్రైవింగ్ కాదు (Manual car driving tips).

Hyundai Creta: The car that is rushing in the market
Join WhatsApp