Maruti Swift Safety Excellence with 6 Airbags & 25 km Mileage

Maruti Swift: ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మారుతి స్విఫ్ట్. ఈ కారు మనకు అందుబాటు ధరలో అద్భుతమైనటు వంటి ఫీచర్లతో లభిస్తున్నది. ఈ కార్ యొక్క ఫీచర్స్ ఇతర వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. మారుతి సుజుకి జెడ్ సిరీస్ కొత్త పెట్రోల్ ఇంజన్ తో త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

Maruti Swift Safety Excellence with 6 Airbags & 25 km Mileage

తాజాగా అందినటువంటి నివేదిక ప్రకారం.. 2024 స్విఫ్టు ఫిబ్రవరి నెలలో మన ముందుకు రాబోతోందని తెలుస్తోంది. మారుతి సుజుకి స్విఫ్ట్ HEAR TECT ప్లాట్ ఫామ్ పై నిర్మించారు. ఈ కారు అతి తక్కువ బరువు, అత్యధిక సామర్థ్యంతో దూసుకుపోతోంది. ఇక దీని పొడవు 3860MM, ఎత్తు 1500MM, వెడల్పు 1695MMకలిగి ఉంది. అంతేకాకుండా ఈ కారులో 265 లీటర్ల బూట్స్ స్పేస్ ఉంటుంది.

Also Read: Revolt: రివోల్ట్‌ నుంచి సరికొత్త EV బైక్‌.. సింగిల్ ఛార్జ్‌తో 150KM మైలేజ్‌

ఇక ఈ కారు డిజైన్ విషయానికొస్తే.. ఆకర్షనీయమైనటువంటి గ్రిల్స్, కొత్త ఎల్ఈడి హెడ్ లాంప్ తో రానున్నది. కొత్త మోడల్ లో కారుకి డోర్ హ్యాండిల్స్ కూడా ఉండవు. అంతేకాకుండా అల్లాయ్ విల్స్, సి ఆకారపు ఎల్ఈడి టెయిల్ లైట్లు, అలాగే కారు ముందు భాగంలో బాలేనో వంటి ఇంటీరియర్ ఇవ్వనున్నారు. ఇక ఈ కారు ఫీచర్స్ విషయానికొస్తే.. Mid ఆటోమెటిక్ ఎయిర్ కండిషనింగ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రిమోట్ స్టోరేజ్, డోర్ మిర్రర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Maruti Swift Safety Excellence with 6 Airbags & 25 km Mileage

అంతేకాకుండా 9 అంగుళాల టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆపిల్ కార్ ప్లే, గ్లోవ్ బాక్స్, సెంటర్ కన్సోల్ ట్రే, డ్రింక్ హోల్డర్ లు, ఫ్రంట్ డోర్ ప్యాకెట్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా 1.2లీటర్, జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ తో రాబోతోంది. ఇక ఈ కారు ఒక్క లీటర్ పెట్రోల్ పోస్తే 25.5 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.(Maruti Swift)

Join WhatsApp