MG Cyberster Electric sports car at a low price Speed ​​of 100 km in 3 seconds

MG Cyberster: మన ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. బైక్స్ అలాగే కార్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వాహనాలు లాంచ్ అవుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే జనాలు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. MG Cyberster

MG Cyberster Electric sports car at a low price Speed ​​of 100 km in 3 seconds

దానికి తగ్గట్టుగానే ఇండియన్ మార్కెట్లో గాని ఇతర దేశాలలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ విపరీతంగా వస్తున్నాయి. అయితే తాజాగా అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు మార్కెట్లోకి వచ్చేసింది. జె ఎస్ డబ్ల్యూ, ఎంజి సంయుక్తంగా తయారుచేసిన లేటెస్ట్ కారు ఎంజి సైబర్ స్టర్. వాస్తవానికి 2021 సంవత్సరంలోనే ఈ కారును ప్రకటించి అనంతరం లాంచ్ చేశారు. ఇక 2024 చివరినాటికి చైనీస్, యూరోపియన్ మార్కెట్లలో విక్రయాలకు ఈ కారు లాంచ్ కాబోతోంది.MG Cyberster

Also Read: Komaki Electric Scooters: డబుల్ బ్యాటరీతో అదిరిపోయే బైక్‌.. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 200కి.మీ !

మరి అలాంటి ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఎలక్ట్రికల్ స్పోర్ట్స్ కారు పొడవు 45 33 ఎంఎం పొడవు, 1912 ఎంఎం వెడల్పు ఉంటుంది. ఇక ఈ కారు ఎత్తు 1328 ఎంఎం ఉంటుంది. అంతేకాకుండా 19 నుంచి 26 వరకు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మనకు వస్తాయి. ఈ కారులో 64 కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. MG Cyberster

అలాగే ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే… 580 కిలోమీటర్లు ఈ కారు ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ కారు ధర 53 లక్షలు ఉండే ఛాన్స్ ఉంది. అలాగే 3.2 సెకండులో 100 కిలోమీటర్ల వేగంతో ఈ కారు దూసుకు వెళ్తుంది. ఎంజి సైబర్ స్టర్ స్పోర్ట్స్ కారు ఈ ఏడాది చివర్లో లేదా మధ్యలో రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది.MG Cyberster

Join WhatsApp