MG Cyberster: New car from MG

MG Cyberster: ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయినటువంటి mg మోటార్స్ భారత్ లో తన మొదటి ఎలక్ట్రికల్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. గత 30 ఏళ్ల ఎంజి కంపెనీ చరిత్రలో తొలిసారిగా వస్తున్న స్పోర్ట్స్ కారు ఇది. దీని పేరే ఎంజి సైబర్ స్టార్. ఈ కారు యొక్క ప్రత్యేకతలు చూద్దాం. ఈ యొక్క స్పోర్ట్స్ కారు అధునాతన టెక్నాలజీతో పాటు ఎలక్ట్రికల్ పవర్ డ్రైవ్ ట్రైయిన్ తో వస్తోంది. ఈ కారు డిజైన్ పరంగా చూస్తే తన వారసత్వాన్ని కొనసాగిస్తూ లాంగ్ హుడ్ బ్యూటిఫుల్, స్టైలింగ్ తో పాటు రెండు సీట్లు రియల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది.

MG Cyberster: New car from MG

ఈ కారు డిజైన్ బ్రిటిష్ స్పోర్ట్స్ కారు డిజైన్ లా ఉంటుందట.ప్రస్తుతం మార్కెట్ లో వస్తున్నటువంటి ఎలక్ట్రికల్ కార్లన్నీ కొత్త కొత్త మార్పులతో వస్తున్నప్పటికీ ఎంజీ మాత్రం సైబర్ స్టారును వాటికి విరుద్ధంగా సింపుల్ లెన్స్ తో తీర్చిదిద్దింది. ఇక ఈ కారు డిజైన్ పరంగా చూస్తే.. దీనికి రెండు వైపులా ఎల్ఈడి హెడ్లైట్లు, పొడవాటి బానేట్, గ్లోస్ బ్లాక్ ప్లాస్టిక్ ను ఉపయోగించడం ద్వారా ఈ కార్ రీయర్ సైజు కంటే చిన్నగా కనిపిస్తుంది.(MG Cyberster)

Also Read: Tata Harrier Ev: టాటా హారియర్ ఒక్క ఛార్జ్ 500కీ”మీ”.!

ఎంజి సైబర్ స్టార్ లో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 2 స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ తో విల్ ఉంటుంది. సెంటర్ కన్సోల్ ఫై గేర్ సెలెక్టర్ కంట్రోలు, రెండు కప్ హోల్డర్స్, అంతేకాకుండా బూటు స్పేస్ చిన్నగా ఉన్నప్పటికీ లోపల ఇద్దరి లగేజ్ ని సరిపడేంత స్థలం ఉంటుంది. ఈ కారులో నాలుగు స్క్రీన్లు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్ హ్యాండిల్ చేసేలా ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంటుంది. ఇందులో 2రెండు పవర్ ట్రైయిన్ ఎంపికలు, సింగిల్ మోటార్ వేరియంట్ డ్యూయల్ మోటార్ వేరియంట్లు కూడా ఉన్నాయి.

MG Cyberster: New car from MG

ఇక ఈ కారు 77kwh బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. ఇక ఇది 535 బిహెచ్ ఫీ, 725mm టార్కు ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒకసారి ఫుల్ చార్జ్ అయితే చాలు 580 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణం చేస్తుంది. ఇందులో సింగిల్ మోటార్ వేరియంటు 64 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, రియర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీ, 308bhp శక్తి ఉత్పత్తి చేయడమే కాకుండా ఒక్క ఛార్జ్ పై 520 కిలోమీటర్ల రేంజ్ అందుకుంటుంది. ప్రస్తుతం ఈ కారు ఇండియన్ కరెన్సీ ప్రకారం 53 లక్షలుగా ఉంది.(MG Cyberster)

Join WhatsApp