MG Gloster : ఎంజీ గ్లోస్టర్ కారు ఓనర్లకి ఎంజి మోటార్ ఇండియా గుడ్ న్యూస్ ని చెప్పింది. కస్టమర్ల కోసం ప్రత్యేకమైన యాజమాన్య అనుభవ కార్యక్రమాన్ని ప్రకటించింది. అయితే ఈ స్కీం ద్వారా కస్టమర్లు మొదటి మూడేళ్లు కూడా జీరో మెయింటెనెన్స్ పొందవచ్చు. ఈసారి కొత్త ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లకి మరింత చేరువ అవ్వడానికి ప్రయత్నం చేస్తోంది. భారత్ మార్కెట్ ని పెంచుకునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ బ్రాండ్లు విదేశీ ఆఫర్లు స్పెషల్ డిస్కౌంట్లతో కంపెనీలు ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.

MG Gloster MG motar good news

ప్రముఖ విదేశీ బ్రాండ్ ఎంజి మోటార్స్ భారత్లో కస్టమర్ల కోసం ప్రత్యేక కార్యక్రమం తీసుకువచ్చింది. ఎంజి మోటార్ ఇండియా అనుభవ కార్యక్రమం కింద ప్రారంభ మూడేళ్లు లేదా 45 వేల కిలోమీటర్ల పరిమితి దాకా జీరో సర్వీస్ అలానే రిపేర్ ఖర్చులను అందిస్తోంది ఈ అవకాశాన్ని ఎంజి గ్లోబల్ స్టార్ యజమానులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఓనర్ షిప్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం కింద కవరేజ్ లో వైపర్ బ్లేడ్లు, ఇంజన్ ఆయిల్, ఫిల్టర్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, బ్రేక్ ప్యాడ్లు వంటి వేర్ అండ్ టెర్ పార్ట్స్ ని ఫ్రీ గా సర్వీస్ చేయించుకోవచ్చు.

Also read: Google Photos: గూగుల్ ఫోటోస్‌లో కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్య కూడా ఉండదు..!

వీటిపై ఎటువంటి నిర్వహణ ఖర్చులు ఉండవని చెప్పారు. టైర్ మరియు బ్యాటరీ కి సంబంధిత ఖర్చులని మాత్రం కంపెనీ భరించదు. కంపెనీ యజమాన్యం యొక్క మూడేళ్ల తర్వాత గ్లోస్టర్ కస్టమర్లకి హామీ ఇవ్వబడిన బై బ్యాక్ ఆప్షన్ కూడా అందిస్తుంది కస్టమర్లు ఆప్షనల్ ప్లాన్ తో ఐదేళ్లు లేదా 75 వేల కిలోమీటర్ల దాకా పొడిగించుకునే సౌలభ్యాన్ని కూడా ఇచ్చింది భారత్ మార్కెట్లో మూడు విభిన్న ట్రిమ్మలలో అందుబాటులో ఉంటుంది సూపర్, షార్ప్, సావి అనే మూడు వేరియంట్స్ లో దీనిని తీసుకోవచ్చు ఈ కారు ఆరు మరియు ఏడు సీట్లు ఆప్షన్లలో వస్తుంది (MG Gloster).

Join WhatsApp