New Honda Activa Electric to Launch in 2025

Honda Activa Electric: భారతదేశ మార్కెట్ చాలా పెద్దదన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా జనాలు ఉండటం దానికి తగ్గట్టు ఇండియాలో మార్కెట్ వ్యాల్యూ ఎక్కువగా ఉండటం మనం చూస్తాం. మన ఇండియాలో ఎలాంటి వస్తువు తీసుకువచ్చిన బిజినెస్ బాగానే అవుతుంది. ఇతర దేశ కంపెనీలు ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ విక్రయాలు జరుపుకుంటాయి. అయితే మన వాళ్లు కూడా ఇతర దేశ వస్తువులను విపరీతంగానే కొంటారు. Honda Activa Electric

New Honda Activa Electric to Launch in 2025

ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. ఇండియాలో గత రెండు సంవత్సరాలుగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అందరూ ఎలక్ట్రానిక్ వాహనాలనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే టూవీలర్ వాహనాల కంపెనీలు రకరకాల టూ వీలర్ బైక్స్ తీసుకొస్తున్నాయి. 60 వేల నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయన్న సంగతి కూడా తెలిసిందే. Honda Activa Electric

Also Read: Hero Electric Bike: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌…లైసెన్స్‌ అవసరమే లేదు..110 KM మైలేజ్‌

అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియాలోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ రాబోతుంది. హోండా యాక్టివా అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు పెట్రోల్ తో నడిచే హోండా యాక్టివా బైక్ ఉంది. ఈ డిసెంబర్ చివరి నాటికి లేదా జనవరి 2025 సంవత్సరంలో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ బైక్ రాబోతుంది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. కర్ణాటకలో దీన్ని తయారు చేస్తున్నారని కంపెనీ స్పష్టం చేసింది. Honda Activa Electric

ఈ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు వీటి సంఖ్యను పెంచేందుకు కర్ణాటకలోని నరసాపురం ఫెసిలిటీలో కొత్త డెడికేటెడ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది హోండా కంపెనీ. ఇక్కడ ఒక మిలియన్ యూనిట్లు తయారవుతున్నాయట. ఇక్కడ వాహనాల బ్యాటరీలు అంతేకాకుండా పవర్ కంట్రోల్ యూనిట్ భాగాలను తయారు చేస్తోందట కంపెనీ. హర్యానాలోని గురుగ్రం లో స్కూటర్ ఇంజన్లు కూడా అసెంబిల్ చేస్తున్నారట. ఇక ఈ కొత్త బైక్ ధర అలాగే ఫీచర్స్ త్వరలోనే కంపెనీ విడుదల చేయనుంది. Honda Activa Electric

Join WhatsApp