New TVS iQube Electric Scooter will get Fame subsidy of ₹ 22065

TVS iQube: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విక్రయాలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీల మధ్య పోటీ కూడా నెలకొంది. ఒకదానికొకటి పోటీగా తమ ఎలక్ట్రిక్ వాహనాలపై ఆఫర్లను ప్రకటిస్తున్నాయి కంపెనీలు. ఇండియా వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటికే వంద రూపాయలు క్రాస్ అయ్యాయి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు. TVS iQube

New TVS iQube Electric Scooter will get Fame subsidy of ₹ 22065

ఇలాంటి నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా చార్జింగ్ పెట్టి అలా కిలోమీటర్లకు కిలోమీటర్లు తిరిగేస్తున్నారు జనాలు. అయితే ఇలాంటి నేపథ్యంలో టీవీఎస్ కంపెనీ తమ ఎలక్ట్రిక్ బైక్స్ పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దాదాపు 21 వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది టీవీఎస్ కంపెనీ. టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ బైక్పై తాజాగా ఆఫర్ ఇచ్చింది.TVS iQube

Also Read: EV subsidy scheme: ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే 50,000 వరకు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేయండి !

మార్చి మాసంలో ఈ బైక్ కొనుగోలు చేస్తే దాదాపు 22 వేల రూపాయల వరకు ఆదా చేసుకున్న సదుపాయాన్ని కలిగించింది టీవీఎస్ కంపెనీ. ఈ బైక్ కొనుగోలు చేయగానే మనకు 6000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా 5000 రూపాయల ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మనకు ఉచితంగా లభిస్తుంది. ఈ అమ్మాయిలో కొనకుండా నేరుగా బైక్ కొనుగోలు చేస్తే మనకు 7500 వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు కంపెనీ ముందుకు వస్తోంది.TVS iQube

ఇంకా మరికొన్ని డిస్కౌంట్లు మొత్తం కలిపితే దాదాపు 30 వేల రూపాయల వరకు మనకు డిస్కౌంట్ వస్తుందట. అయితే ఈ ఆఫర్ మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని కంపెనీ. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మళ్లీ ఈ బైక్ ధరలు పెరుగుతాయి. ఇక ఈ టీవీఎస్ ఐ క్యూబ్ బైక్ ధర 1.46 లక్షలు ఉంది. ఏడు కలర్స్ లో మనకు ఇది వస్తుంది. TVS iQube Electric ఫుల్‌ ఛార్జింగ్‌ కావాలంటే 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇక ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌ అయితే..TVS iQube Electric 110 కిమీ ప్రయాణిస్తుంది.TVS iQube

Join WhatsApp