Ola Mobility Announces Launch of E-Bike Service in Delhi, Hyderabad

Ola: హైదరాబాద్ మహానగరం గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఈ మహానగరంలో దాదాపు కోటి మంది నివసిస్తున్నారు. ఎటు చూసినా… హైదరాబాద్ ప్రాంతమే కనిపిస్తుంది. అసలు హైదరాబాద్ చివరి భాగం ఎవరికి కనిపించదు. దాదాపు నాలుగు జిల్లాలను కవర్ చేసింది హైదరాబాద్ మహానగరం. ఈ తరుణంలో హైదరాబాద్ మహానగరంలో విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది. మనం బయటికి వెళ్తే కచ్చితంగా ట్రాఫిక్ లో ఇరుక్కోవాల్సి వస్తుంది.

Ola Mobility Announces Launch of E-Bike Service in Delhi & Hyderabad

అయితే ఈ ట్రాఫిక్ సమస్య కోసం మెట్రో ఏర్పాటు చేసినప్పటికీ… పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో చాలామంది రాపిడో, ఉబర్ లాంటి సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ వాసులకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహానగరం తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఈ-బైక్ టాక్సీ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది.

Also Read: Revolt: రివోల్ట్‌ నుంచి సరికొత్త EV బైక్‌.. సింగిల్ ఛార్జ్‌తో 150KM మైలేజ్‌

బెంగళూరు మహానగరంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు… విజయవంతం కావడంతో… హైదరాబాద్ మరియు ఢిల్లీలో…ఈ బైక్ టాక్సీ సేవలను ప్రారంభించినట్లు అధికారిక ప్రకటన చేసింది. మరో రెండు నెలల్లో మరికొన్ని నగరాలలో 10,000 ఈ-వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామని ఓలా వెల్లడించింది.

అంతేకాకుండా తక్కువ ధరలో… సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఓలా కంపెనీ. ఐదు కిలోమీటర్ల వ్యవధికి… 25 రూపాయలు ఛార్జ్ చేసేందుకు సిద్ధమైంది. అలాగే 10 కిలోమీటర్లకు 50 రూపాయలు వసూలు చేస్తోంది. పదిహేను కిలోమీటర్లకు 75 రూపాయలు వసూలు చేసేందుకు ఓలా నిర్ణయం తీసుకుంది. (Ola)

Join WhatsApp