Range Rover Evoque Luxury Car Features

Range Rover Evoque: మంచి కారు కోసం చూస్తున్నారా..? అయితే ఈ కారు ఫీచర్స్ ని చూడండి. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ భారత్‌ మార్కెట్‌ లో రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ SUV 2024 కారును తీసుకు రావడం జరిగింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ కారు ధర రూ.67.90 లక్షలు గా ఉంది. ఈ లగ్జరీ కారు డైనమిక్‌ SE వేరియంట్‌ లో మాత్రమే అందుబాటులో ఉంటోంది. గత సంవత్సరం జూన్‌ లో ప్రపంచ వ్యాప్తం గా ఈ కారు ని లాంచ్‌ చేశారు. భారత్‌ మార్కెట్‌ లో అప్‌గ్రేడ్‌ చేయబడిన ఈ రేంజ్‌ రోవర్‌ కారు పెట్రోల్‌ అలానే డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్ల లోనే అందుబాటులో ఉంటుంది.

Range Rover Evoque Luxury Car Features

ఎక్స్టీరియర్‌లో భారీ మార్పులు ఏమీ లేవు. LED రన్నింగ్‌ ల్యాంప్‌ దీంతోపాటు సూపర్‌ స్లిమ్‌ LED హెడ్‌ల్యాంప్, ట్విన్ 10 స్పోక్‌ డిజైన్‌తో ఇచ్చారు. ఈ కారు అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంది. కొరింథియన్‌ బ్రాంజ్‌ అలానే ట్రిబెకా బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది ఈ కారు.

Also Read: Janhvi Kapoor: ” ఆ హీరో నాకంటే చిన్న పిల్లాడి లాగా ఉన్నాడు “.. ఆ స్టార్ హీరో లుక్ పై ఆసక్తికర కామెంట్లు చేసిన జాన్వి..!

రేంజ్ రోవర్‌ ఎవోక్‌ ఇంటీరియర్‌ విషయానికి వస్తే.. క్యాబిన్‌లో స్పష్టమైన మార్పులు చేశారు. 11.4 అంగుళాల పివి ప్రో టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను ఇచ్చారు. ఆపిల్‌ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో ఇది ఇంటిగ్రేడ్ అవుతుంది. 3D కెమెరా, ఎయిర్‌ ఫ్యూరిఫికేషన్‌ సిస్టమ్‌ అలానే పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి అదనపు ఫీచర్లతో వస్తోంది. (Range Rover Evoque)

Range Rover Evoque Luxury Car Features
Join WhatsApp