Revolt Motors RV400 BRZ Electric Bike Launched In India

Revolt: మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు కూడా గణనీయమైన స్థాయిలో పెరుగుతున్నాయి. దీనంతటికీ కారణం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మాత్రమే. గత రెండు సంవత్సరాల దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు కొనుగోలు చేయడం లేదు.

Revolt Motors RV400 BRZ Electric Bike Launched In India

దీనికి తగ్గట్టుగానే మార్కెట్లోకి రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. టూ వీలర్ నుంచి ఫోర్ వీలర్ వరకు… చాలా ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. తక్కువ ధరలో మైలేజ్ ఎక్కువ ఇచ్చేలా మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి ఎలక్ట్రిక్ వాహనాలు. ఈ నేపథ్యంలోనే తాజాగా సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇండియాలో లాంచ్ అయింది. రివోల్ట్ మోటార్స్… అనే కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను మన ఇండియాలో లాంచ్ చేసింది.

Also Read: E-Luna: లూనా, LML ..బైక్స్ మళ్లీ వచ్చేస్తున్నాయి..ధర ఎంతంటే ?

రివోల్ట్ ఆర్ వి 400 BRZ పేరుతో ఈ కొత్త బైక్ ను తీసుకువచ్చింది. ఇక ఈ కొత్త RV బైక్ ధర 1.38 లక్షలు ఉంది. ఎక్స్ షోరూం ప్రకారం ఈ ధర ప్రకటించారు. ఇప్పటికే ఈ బైక్… విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. రివోల్ట్ కంపెనీ వెబ్సైట్ ద్వారా… ఈ కొత్త బైక్లు బుక్ చేసుకోవచ్చు. ఇక రివోల్ట్ ఆర్ వి 400 BRZ బైక్ కు సంబంధించిన ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం. (Revolt)

Revolt Motors RV400 BRZ Electric Bike Launched In India

రివోల్ట్ ఆర్ వి 400 BRZ బైక్ కు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే… మనం 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలాగే ఈ బైక్ కు 3.24 kwh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అంతేకాకుండా ఈ బైక్ ఐదు గంటలలో…ఫుల్ చార్జింగ్ ఎక్కుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం… ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసేవారు…రివోల్ట్ ఆర్ వి 400 BRZ కొనుక్కోవాలని కంపెనీ ప్రకటించింది.

Join WhatsApp