River Indie's Trendy Electric Bikes What Makes Them Special

River Indie: ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ బైకులు జోరు ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా రివర్ ఇండి ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ కూడా మళ్లీ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది .మార్కెట్లో ఈ బైక్ లకు మంచి డిమాండ్ ఉన్నది.. ఆసక్తి గల కస్టమర్లు సైతం ఈ ఎలక్ట్రిక్ బైక్ ను సుమారుగా రూ.2500 రూపాయల చెల్లింపు తో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.. అయితే పలు నగరాలలో ఈ బైక్ షో రూములు కలవు.ముఖ్యంగా బెంగళూరు ప్రాంతాలలో కూడా ఈ బైక్ షో రూమ్ లో కలవు.

River Indie’s Trendy Electric Bikes What Makes Them Special

2021 లో రివర్ ఇండి ఎలక్ట్రిక్ బైక్ని సైతం ప్రారంభించబడింది..ఈ ఎలక్ట్రిక్ బైకు సరికొత్త డిజైన్తో తయారు చేశారు. అయితే కంపెనీ మొదట ఈ ఉత్పత్తిని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించగా హాట్ కేకుల ఈ బైక్స్ అమ్ముడుపోయాయట. దీంతో తర్వాత మళ్లీ 2023 ఆగస్టులో ఉత్పత్తిని మొదలుపెట్టింది. అప్పుడు కూడా బుకింగ్స్ మొదలు కావడంతో కస్టమర్లు ఈ బైక్ను కొనుగోలు చేసేందుకు చాలా ఆసక్తిని కనబరిచారు.

Also Read: Amazon Sale 2024: ఈ ల్యాప్ టాప్ పై భారీ తగ్గింపు.. త్వరపడండి..!

కేవలం నెల రోజులలోనే దాదాపుగా 200 రివర్ ఇండి ఎలక్ట్రిక్ బైక్లు అమ్ముడుపోవడంతో ఈ స్కూటర్లకు ఇండియాలో మంచి ఆదరణ లభిస్తోంది. అందుకు కారణం ఈ బైకు యొక్క డిజైన్ అనే చెప్పవచ్చు. ఆకర్షించే డిజైన్ తో పాటు మెరుగైన పనితీరు అధిక స్పేస్ కారణంగానే ఎక్కువగా నగరాలలోని ప్రజలు వీటిని కొనడానికి మక్కువ చూపుతున్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఎలక్ట్రిక్ బైక్స్ ల కోసం బుకింగ్లను రీఓపెన్ చేసింది.

River Indie's Trendy Electric Bikes What Makes Them Special

రివర్ ఇండి ఎలక్ట్రిక్ బైక్ అధికార వెబ్సైట్ నుంచి లేదా బెంగళూరులో తెరిచిన షో రూమ్ ని సైతం సంప్రదించడం వల్ల బుకింగ్ చేసుకోవచ్చు.. ఈ బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే..6.7 kw మోటార్ తో పనిచేస్తాయి..90kmph గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం నాలుగు సెకండ్ల లోపే జీరో నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్ ని అందుకుంటుంది. ఒకసారి చార్జింగ్ చేశారంటే ఈ బైక్ 120 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందట.800 పోర్టబుల్ చార్జర్లను కూడా ఇస్తుందట. ప్రస్తుతం మార్కెట్లో ఈ బైక్ ధర రూ.1.38 లక్షలు గా ఉన్నది.. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ బైకు పైన 13 వేల రూపాయలు పెరిగిందట. (River Indie)

Join WhatsApp