Royal Enfield Classic 350 Bobber AKA Shotgun 350 Spied 

Royal Enfield Bobber 350: ఇండియా లో అనేక రకాల టూవీలర్ వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో… ఎక్కువమంది సిఎన్జి అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మనదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 100 రూపాయల దాటిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనివిధంగా చమురు ధరలు విపరీతంగా పెరిగాయి.

Royal Enfield Classic 350 Bobber AKA Shotgun 350 Spied 

దీంతో ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వాడుతున్నారు జనాలు. దీనికి తగ్గట్టుగానే చాలా రకాల బైక్స్ ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల ప్రభంజనం నడుస్తున్న నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. అది త్వరలోనే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి అదిరిపోయే కొత్త మోడల్ బైక్ రాబోతుంది.

Also Read: Tata Motors: అదిరిపోయే ఫీచర్స్‌ తో టాటా టియాగో, టైగోర్ CNG కార్లు..ధర ఎంతంటే ?

ఈ కొత్త బైక్ పేరు క్లాసిక్ 350 బాబర్. క్లాసిక్ 350 బాబర్ పేరుతో మార్కెట్లోకి ఈ బైక్ లాంచ్ కాబోతోంది. ఇప్పటికే క్లాసిక్ 350 మోడల్ బైక్ ఉంది. అయితే దీనిలో బాబర్ డిజైన్ ను తీసుకువస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఈ కొత్త బైక్ ధర కూడా అంచనా వేస్తున్నారు.

నిపుణుల అంచనా ప్రకారం 2.2 లక్షల వరకు ఈ బైక్ ధర ఉంటుందని చెబుతున్నారు. క్లాసిక్ 350 బాబర్ బైక్ కు 350 సీసీ ఇంజన్ ఉంటుందని సమాచారం. అంతేకాకుండా క్లాసిక్ 350 లాగానే మెరుగైన సీటింగ్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు కూడా మనకు వస్తాయి. ఇక ఏడాది చివర్లో ఈ బైక్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Join WhatsApp