Royal Enfield Classic 350 Flex: New model bike

Royal Enfield Classic 350 Flex: రాయల్ ఎన్ఫీల్డ్ దీని పేరులోనే రాయాలిటీ కనిపిస్తుంది. అలాంటి ఈ బైకును యువత నుంచి మొదలు పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడతారు. ఈ బైక్ పై కూర్చుని వెళ్తుంటే కోట్ల రూపాయల కారు లో కూర్చున్నా కానీ, ఆ ఫీలింగ్ రాదు. అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ఢిల్లీలో జరిగినటువంటి ప్రతిష్ఠాత్మక భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ ఫోలో ప్రదర్శించబడింది. ఈ సందర్భంగా ఈ బైక్ సంబంధించిన కొన్ని ఫీచర్లు, ఇతర వివరాలను బయటపెట్టారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Royal Enfield Classic 350 Flex: New model bike

ఈ యొక్క మోటార్ సైకిల్ పెట్రోల్ మరియు ఇథనాలు మిశ్రమంతో నడుస్తుందట. ఇందులో ఇథనాలు 85% వరకు ఉంటే , ఈ ఫీచర్ సస్టైనబుల్ మొబిలిటీకి రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క నిబద్ధతను చెబుతుందట. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక చక్కని ముందడుగు అని చెప్పవచ్చు. ఇందులో ఈ85 పెట్రోల్-ఇథనాలు మిశ్రమంపై సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. (Royal Enfield Classic 350 Flex)

Also Read: Flight Engine : విమానం ఇంజిన్‌ ఎంత శక్తివంతమైనదో తెలుసా..?

ఈ అధునాతన ఇంధన అనుకూలత ఉన్నప్పటికీ ఫ్లెక్స్ ఇంధన మోడల్ ప్రామాణిక క్లాసిక్ 350 యొక్క యాంత్రిక సమగ్రతను పని తీరును నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క బైక్ 349 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్,6100Rpm వద్ద 20.2Bhp అలాగే 4000 వద్ద 27Nm టార్కును అందిస్తుందట. అంతేకాకుండా అత్యాధునికమైనటువంటి 5 స్పీడ్ గేర్ బాక్స్ తో అమర్చబడింది.

Royal Enfield Classic 350 Flex: New model bike

క్లాసిక్ 350ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ ప్రత్యేకమైనటువంటి విజువల్ లో ఆకర్షణీయంగా కనిపిస్తుందట. ఇది సాంప్రదాయ క్లాసిక్స్ 350 మోడల్ నుంచి వేరుగా ఉండేటువంటి ఆకుపచ్చ, ఎరుపు పెయింట్ బాడీ కలిగిందట. ఇక ఈ బైక్ ధర విషయానికొస్తే 1.93 లక్షల నుంచి మొదలు రూ:2.25 లక్షల మధ్య చెన్నై ఎక్స్ షోరూం ద్వారా ఉంది. భారత్ మోబిలిటీ గ్లోబల్ ఎక్స్ ఫోలో ఇలాంటి బైకును ఆవిష్కరించడం ఆటోమొబైల్ రంగంలోనే అద్భుతం అని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు.(Royal Enfield Classic 350 Flex)

Join WhatsApp