Tata Harrier EV 500km per charge

Tata Harrier EV : ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి వాహనాల్లో టాటా కంపెనీకి చెందిన వాహనాలు మంచి ప్రాధాన్యత పొందాయి. సేఫ్టీ విషయంలో కూడా ఈ వాహనాలకు మంచి పేరుంది. అలాంటి టాటా కంపెనీ నుంచి టాటా హారియర్ వాహనం ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నది. మరి దీని యొక్క ప్రత్యేకతలు ఇతర వివరాలు తెలుసుకుందాం. టాటా మోటార్స్ హరియర్ సరికొత్త ఎలక్ట్రికల్ వాహనాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నది.

Tata Harrier EV 500km per charge

ఈ వాహనాన్ని అద్భుతమైన డిజైన్ మరియు ఎల్ఈడి డిఆర్ఎల్ తో కూడిన విలక్షణమైనటువంటి స్ప్లిట్ హెడ్ లైట్ తో డిజైన్ చేయనుంది. అంతేకాకుండా ఫ్యూచరిస్టిక్ టచ్ ను అందిస్తుంది. ఇది ఇంతవరకు వైట్ , బాడీ కలర్ మరియు రెండు టౌన్ రూఫ్ ఆప్షన్ కారు యొక్క ఎలక్ట్రిక్ గుర్తింపును చెబుతోంది. ఈ వాహనాన్ని ఐదుగురు సౌకర్యవంతంగా కూర్చునేలా రూపొందిస్తున్నారట. విశాలమైనటువంటి క్యాబిన్ రిలాక్స్డ్ జర్నీని అందిస్తుందట. ఇందులో సీటింగ్ పొజిషన్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. (Tata Harrier EV )

Also Read: Greaves Eltra City: మార్కెట్‌లోకి ఈవీ ఆటో రిలీజ్‌..ధర, ఫీచర్స్ ఇవే

అలాగే ఆల్ వీల్ డ్రైవ్ తో కూడిన డ్యూయల్ మోటార్ సెట్ అప్ థ్రిల్లింగ్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మనకు అందిన సమాచారం ప్రకారం నెక్సాన్ ఎలక్ట్రికల్ వాహనంలో ఉన్న బ్యాటరీ కంటే దీంట్లో పెద్ద బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ వాహనం ఒక్క ఛార్జ్ ద్వారా 500 కిలోమీటర్లు ఈజీగా ప్రయాణం చేస్తుందట. ఇక ఇందులో పెద్ద టచ్ స్క్రీన్, ఫీచర్ రిచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం నావిగేషన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.

Tata Harrier EV 500km per charge

అలాగే పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం సౌండ్ సిస్టం వంటి ఫీచర్లు కలిగి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఉత్సాహంగా చేస్తుంది. భద్రత కోసం అద్భుతమైనటువంటి ఎయిర్ బ్యాగులు , 360 డిగ్రీల కెమెరా పార్కింగ్ సిస్టం వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క ఖచ్చితమైన ధర బయటకు రాలేదు కానీ అంచనా ప్రకారం రూ: 30 లక్షలు ఢిల్లీ (ఎక్స్ షోరూం) ధర ఉండనున్నట్టు తెలుస్తోంది.(Tata Harrier EV )

Join WhatsApp