TATA Motors Raises Car Prices Across Car Models

TATA Motors: ఇండియాలో ఫోర్ వీలర్ వాటిలో అత్యధికంగా ప్రజాధరణ పొందిన వెహికల్స్ టాటా మోటార్స్ కూడా ఒకటి.. ముఖ్యంగా టాటా నుంచి కార్లు కొనుగోలు చేయడానికి చాలామంది ప్రజలు మక్కువ చూపుతూ ఉంటారు.. సేఫ్టీ పరంగా అన్ని ఉంటాయని వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు ప్రజలు.అయితే ఇప్పుడు తాజాగా ఈ కార్లు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు సైతం ఇకమీదట మరింత ఖర్చు చేయవలసి ఉంటుంది. వచ్చే నెల ఫిబ్రవరి 1 నుంచి అన్ని మోడల్స్ పైన కార్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఇటీవల ప్రకటించడం జరిగింది.

TATA Motors Raises Car Prices Across Car Models

ముఖ్యంగా టియాగో, హరియర్ , టిగోర్ ఈవీ, సఫారీ, హరియర్, పంచ్, ఆల్టోజ్ , టియాగో ఈవి , పంచ్ ఈవీ కార్ల పైన కూడా ఈ ధరలు పెరగబోతున్నాయట.. కంపెనీ తన కార్ల ధరలను సైతం ప్రస్తుతం ఉన్న వాటిలో 0.7 శాతం వరకు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ధర పెంపు మాత్రం ఫిబ్రవరి 1 ఈ ఏడాది నుంచి అమలులోకి రాబోతున్నట్లు తెలిపారు .ఇన్ పుట్ ఖర్చుల పెరుగుదలను పాక్షికంగా ఇలా భర్తీ చేయడానికి పెంచాల్సి వచ్చిందంటూ టాటా మోటార్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

Also Read: Chiranjeevi: చిరంజీవి- దాసరి నారాయణరావు గారికి మధ్య విభేదాలు రావడానికి కారణం..?

ప్రస్తుతం టాటా బ్రాండెడ్ నుంచి పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలు, CNG వాహనాలను సైతం అందిస్తోంది ఇటీవల పూర్తిగా ఎలక్ట్రిక్ ఫార్మాట్ మీద బిల్డ్ అయినటువంటి టాటా బ్రాండెడ్ పంచ్ ఈవీ ని కూడా విడుదల చేయడం జరిగింది. గత ఏడాది ఏకంగా టాటా మోటార్స్ బ్రాండెడ్ నుంచి దాదాపుగా 5,50,838 యూనిట్ల కారును కూడా సేల్ చేసినట్లు తెలియజేశారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా తమ కార్ల డిమాండ్ 4.56 శాతం వరకు పెరిగిందని తెలియజేశారు.

TATA Motors Raises Car Prices Across Car Models

2022లో మాత్రం తమ కార్ల 5,26,798 యూనిట్ కార్లను విక్రయించినట్లుగా తెలియజేశారు.అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ కనిపిస్తోంది. ఎవరైతే టాటా కార్లను కొనాలని చూస్తున్నారో ఈనెల 30వ తేదీ లోపు వీటిని తీసుకోవడం మంచిది. ఎందుకంటే వచ్చేనెల మొదటి రోజు నుంచి ఈ కార్ల ధరలు పెరుగుతున్నట్లుగా టాటా బ్రాండెడ్ ప్రకటించింది. ఈ విషయం అటు కస్టమర్లకు కూడా చాలా పెద్దదెబ్బే అన్నట్లుగా తెలుస్తోంది. (TATA Motors)

Join WhatsApp