Tata Punch : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కార్ల ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరికి నచ్చిన కారులని వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈరోజుల్లో చాలా ఆప్షన్స్ వచ్చాయి. పెట్రోల్ కార్లు, సిఎన్జి కార్లు అలానే ఈవీలు. ఇలా రకరకాలు వచ్చాయి. ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీల దండయాత్ర కొనసాగుతూ వుంది. టాటా పంచ్ తో బంపర్ హిట్ ని కొట్టింది. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ టాటా పంచ్ పెట్రోల్ మోడల్ ఒకటే కాదు సిఎన్జి, ఈవీ మోడల్స్ ని కూడా కష్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మూడు కూడా సేల్స్ పరంగా దూసుకు వెళ్తున్న పెట్రోల్ సిఎన్జి ఎలక్ట్రిక్ వెర్షన్లలో ఉన్న ఏకైక టాటా మోటార్స్ కారు.

Which is best in Tata Punch

ఈ టాటా పంచ్ అయితే గత కొన్ని నెలలుగా ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ వెహికల్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. చాలామంది కస్టమర్లు కొనాలని చూస్తున్నారు. కానీ మూడు ఆప్షన్స్ ఉండే సరికి ఏది తీసుకోవాలి అనేది అర్థం కావట్లేదు. టాటా పంచ్ సిఎన్జి పెట్రోల్ ఈవీలో ఏది బెటర్ అనేది ఇప్పుడు చూసేద్దాం.. టాటా పంచ్ ఈవీలో 60/90 కిలోవాట్ల పర్మనెంట్​ మాగ్నెట్ సింక్రోనస్ మోటారు ని ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది.

Also read: Current Bill : సమ్మర్‌లో కరెంట్‌ బిల్‌ ని తగ్గించాలంటే.. ఇలా చెయ్యండి..!

ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ 120 బీహెచ్​పీ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. పెట్రోల్ 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్​తో వుంది. గరిష్టంగా 87బీహెచ్​పీ పవర్, 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. 1.2-లీటర్ ఇంజిన్​ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మేన్యువల్ గేర్​బాక్స్​కి కనెక్ట్​ అయ్యి ఉంటుంది. గరిష్టంగా 72బీహెచ్​పీ పవర్, 103ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది (Tata Punch).

Join WhatsApp