Toyota Fortuner Leader edition : మార్కెట్లోకి రోజురోజుకీ కొత్త కొత్త కార్లు వస్తూనే ఉన్నాయి. చాలా మంది మార్కెట్లోకి వచ్చిన కొత్త కార్ల ని కొనుగోలు చేయడానికి చూస్తున్నారు కొత్త కార్లకి మంచి ఫీచర్ లోని ఇస్తున్నారు తాజాగా టయోటా ఫార్చునర్ లీడర్ ఎడిషన్ లాంచ్ అయింది ఈ మోడల్ ఫీచర్స్ తో పాటు ఇతర వివరాలు కూడా ఇప్పుడే చూసేద్దాం. ఇండియాలో టయోటా కిర్లోస్కర్ మోటార్ కి బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా టయోటా ఉన్న విషయం మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఫార్చూనర్ కి స్పెషల్ ఎడిషన్ ని లాంచ్ చేశారు. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఈ కారుకు సంబంధించిన వివరాలు అందించింది.

Toyota Fortuner Leader edition launch

దీని పేరు టయోటా ఫార్చునర్ లీడర్ ఎడిషన్ ఇందులో కొత్త స్టైల్ ఎలిమెంట్స్ తో పాటుగా కొన్ని అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ మోడల్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఫార్చునర్ లీడర్ ఎడిషన్ విశేషాలు చూద్దాం.. టయోటా ఫార్చునర్ లీడర్ ఎడిషన్ లో కొత్త ఫ్రంట్ బంపర్ స్పాయిలర్స్ అలానే బ్లాక్ వైట్ రంగుల్లో పెయింట్ ఆక్షన్ బ్లాక్ అలోయ్ వీల్స్ వంటివి ఇస్తున్నారు స్పాయిలర్స్ ని ఆథరైజ్డ్ డీలర్స్ ఫిట్ చేస్తారు ఇంటీరియర్ లో డ్యూయల్ టోన్ సీట్లు వైర్లెస్ చార్జర్ టిపిఎంఎస్ ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ వంటి యాడెడ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇచ్చారు.

Also read: OTP Frauds: ఓటీపీతో మోసాలకు చెక్‌.. ప్రభుత్వం కొత్త టెక్నాలజీ..!

ఫార్చునర్ కి మరింత బోల్ట్నెస్ ని ఫీచర్స్ ని యాడ్ చేయడానికి లీడర్ ఎడిషన్ తీసుకువచ్చారు. సిక్స్ స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ కి కనెక్షన్ ఉంటుంది ఆటోమేటిక్ 201 బీహెచ్​పీ పవర్​ని, 500 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుందని కంపెనీ చెప్తోంది 2009లో మొదటిసారి లాంచ్ అయినప్పటికీ టయోటా ఫార్చునర్ ఇండియా ఆటోమొబైల్ మార్కెట్ ని ఏలుతోంది (Toyota Fortuner Leader edition).

Join WhatsApp