Vespa Zx 125: New scooter from Vespa

Vespa Zx 125: వెస్పా కంపెనీ నుంచి సరికొత్త మోడల్ బైకు కస్టమర్లకు అందుబాటులోకి రాబోతోంది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల వేరియంట్లు రిలీజ్ అయి మార్కెట్లో దూసుకుపోయాయి. ఇదే తరుణంలో వెస్పా జెడ్ ఎక్స్ 125 సిసి మోడల్ స్కూటర్ త్వరలో మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ స్కూటర్ యొక్క ప్రత్యేకతలు ఇతర వివరాలు తెలుసుకుందాం.

Vespa Zx 125: New scooter from Vespa

వెస్ప జెడ్ ఎక్స్ 125 ఇంజన్ విషయానికి వస్తే 124 సిసిగా ఉంది. అంతేకాకుండా 115 కిలోల బరువు కూడా ఉంటుంది. స్కూటర్ ఫై కూర్చోవడానికి వీలుగా సీటు హైటు 720 ఎమ్ ఎమ్ గా అమర్చారు. కాకుండా ఈ స్క్యూటి కెపాసిటీ విషయానికి వస్తే 7.4 లీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ స్కూటీ ఇంజన్ పవర్ విషయానికి వస్తే 9.65 BHP గా ఉందట.(Vespa Zx 125)

Also Read: Lexus Lm 350h: లెక్సస్ నుంచి న్యూ ఎస్ యువి.. అదిరే ఫీచర్స్..!

అంతేకాకుండా ఈ వాహనం గంటకి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని సమాచారం. ఈ స్కూటీ కలర్ల విషయానికి వస్తే మొత్తం 7 రంగుల్లో అందుబాటులోకి రానుంది.ఇందులో పెరల్ వైట్, అంజురే బ్లూ, గ్రే, వైబ్రేట్ రెడ్, గ్లోసి రెడ్, ఎల్లో కలర్, మాట్ బ్లూ, వంటి కలర్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ స్కూటర్ 10.11MM టర్కు ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంది. ఈ స్కూటీకి ఐదు సంవత్సరాల వారంటీకి కూడా ఇస్తున్నారు.

Vespa Zx 125: New scooter from Vespa

రిజర్వ్ ఫ్యూయల్ కెపాసిటీ 2 లీటర్ల వరకు ఉంటుందట. ఎమిషన్ స్టాండర్డ్ BS6 పేస్ 2కలిగి ఉంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ 155 ఎంఎంగా ఉంటుంది. ఈ స్కూటర్ కొనుగోలు చేసిన తర్వాత 60 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసేలా వారంటీని అందించారు. అంతేకాకుండా 270 రోజుల్లో నాలుగుసార్లు సర్వీస్ చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఈ స్కూటీ రేటు విషయానికి వస్తే రూ:1.40 లక్షలు గా ఉంది. ఈ స్కూటీ 4.3/5 రేటింగ్ అందించారు.(Vespa Zx 125)

Join WhatsApp