Volkswagen: ఈరోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకి డిమాండ్ బాగా పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండడంతో మార్కెట్లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్లోకి వచ్చింది ఇక ఈ ఎలక్ట్రికల్ కార్ కి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాము. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీనిపై ఒక లుక్ వేసేయండి. ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును ID.4 పేరుతో తీసుకు వచ్చింది. ఈ కారు ఇప్పటికే దేశం లోకి ప్రవేశించింది. దీని ధర ఈ ఏడాది చివర్లో ప్రకటించబడుతుంది.

Volkswagen ev features

ఈ కారు డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ ప్యాక్, రేంజ్ వంటి వివరాలు చూసేద్దాము. ఫోక్స్‌వ్యాగన్ ID.4 డిజైన్ గురించి చూస్తే ఇది ‘VM’ లోగోతో కూడిన స్టైలిష్ గ్రిల్, కూల్ బానెట్, ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ అలానే ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు, 21-అంగుళాల అల్లాయ్ వీల్స్, 3డీ క్లస్టర్ డిజైన్, స్కిడ్ ప్లేట్‌ లతో వస్తోంది. అలానే పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అనేక కనెక్టివిటీ ఆప్షన్‌లతో కూడిన 10-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ కూడా ఇచ్చారు.

Also read: WhatsApp: వాట్సాప్‌లో మరో సూపర్‌ ఫీచర్‌…!

వోక్స్‌వ్యాగన్ ID 4 EV డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్‌ వుంది. 82 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చెయ్యచ్చు. 299 hp శక్తిని, 499 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గంటకు 180 కి.మీ. కేవలం 6 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని ఇస్తుంది. వోక్స్‌వ్యాగన్ ID.4 ధరలను ప్రకటించలేదు (Volkswagen).

Join WhatsApp