Credit Card What are the benefits of a credit cards

Credit Cards: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ కార్డులని వాడుతున్నారు. మీరు కూడా క్రెడిట్ కార్డ్ ని వాడుతున్నారా..? ఈరోజుల్లో క్రెడిట్ కార్డుల యొక్క వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అత్యవసర సమయాల్లో ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది క్రెడిట్ కార్డు బిల్లుని సకాలం లో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. వారికోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇక క్రెడిట్ కార్డులకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని చూద్దాం.. ఈ రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడి పరిమితికి మించి ఖర్చులు చేస్తున్నారు. దాన్ని గడువులోగా చెల్లించకపోతే ఇబ్బందులు తప్పవు.

Credit Cards mistakes and solutions

అలాంటప్పుడు బిల్లును ఇతర క్రెడిట్ కార్డు కి బదిలీ చేసుకోవచ్చని మీకు తెలుసా క్రెడిట్ కార్డు చెల్లింపులు విషయంలో బ్యాలెన్స్ బదిలీ అనేది ఒక రక్షణ ఆయుధంగా పనిచేస్తుంది. ఈ బ్యాలెన్స్ బదిలీ అంటే ఏంటి అనేది చూస్తే… మీ దగ్గర రెండు క్రెడిట్ కార్డులు ఉంటే దాంట్లో మొదటి క్రెడిట్ కార్డు పై బిల్లు బకాయి ఉంటుంది. అయితే మీరు బిల్లు చెల్లించడానికి నగదు లేకుండా మొదటి క్రెడిట్ కార్డు లోని బ్యాలెన్స్ రెండు క్రెడిట్ కార్డు కి ట్రాన్స్ఫర్ చేసి కొన్నాళ్ల తర్వాత బిల్లు చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ కోసం నెట్ బ్యాంకింగ్ సహా క్రెడిట్ కార్డుల కస్టమర్ కేర్ ని సంప్రదించవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా దరఖాస్తు చేయొచ్చు.

Also read: Non veg: నెలరోజుల పాటు మాంసాహారం తినకపోవడం వల్ల ప్రయోజనమా? నష్టమా?

ఎస్బిఐ, యాక్సిస్ ఇలా కొన్ని బదిలీని ఆమోదిస్తున్నాయి. క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించని పక్షం లో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి సందర్భంలోనే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఉపయోగపడుతుంది డిఫాల్ట్ అవ్వకుండా కాపాడుతుంది మీ దగ్గర ఉండే అదనపు క్రెడిట్ కార్డు కి గల 30 , 40 రోజుల బిల్లింగ్స్ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. బిల్లు చెల్లించేందుకు తక్కువ టైంలో లోన్ పొందలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇప్పటికే రుణ భారంతో ఇబ్బంది పడే వాళ్ళు బకాయిలను చెల్లించడానికి సదుపాయం వాడుకోవచ్చు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సేవలు మీద రుసుములు ఇతరు వంటివి అమలు అవుతాయి ఈ సేవలు మీద ఒకటి నుండి ఐదు శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది రెండో కార్డు కూడా నిర్దేశిత పరిమితి దాటక వడ్డీ రేటు వర్తిస్తుంది తరచుగా బ్యాలెన్స్ బదిలీ అవకాశాన్ని ఎంచుకునేటప్పుడు క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది లోన్ పొందడంతో పాటుగా క్రెడిట్ కార్డుల ఆమోదం కూడా కష్టమవుతుంది (Credit Cards).

Credit Card What are the benefits of a credit cards
Join WhatsApp