EPFO: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగులకి ఖాతా వివరాలని మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఏదైనా వివరాలు తప్పుగా ఉంటే వాటిని సరిచేసుకోవాలి. పేరు, అడ్రస్, వివాహ స్థితి వంటి వివరాలు ఎన్ని సార్లు అయినా మార్చుకోవచ్చా..? లిమిట్ ఏమైనా ఉంటుందని విషయాలని చూసేద్దాము ఈపీఎఫ్ అకౌంట్ నుండి నగదు విత్ డ్రా చేసుకోవాలన్న సమయంలో ఎలాంటి తప్పులు లేకుండా సరైన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. లేక తప్పుగా వివరాలు ఎంటర్ చేసిన చాలా సమస్యలు కలుగుతాయి, ముఖ్యంగా పేరులో ఏదైనా తప్పులు లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇంటర్ చేయాల్సి ఉంటుంది.

EPFO name, address change

తప్పుడు డేట్ అఫ్ బర్త్ ఉద్యోగంలో చేరిన తేదీ సరిగ్గా లేకపోతే విత్ డ్రా చేయడానికి కుదరదు. పీఎఫ్ ఖాతాలో వివరాలు తప్పుగా ఉన్నప్పుడు వాటిని సరిచేసుకోవాల్సి ఉంది. అందుకని ఉద్యోగి యజమాన్యం కలిసి జాయింట్ డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా సులువుగా మార్పులు చేయొచ్చు. వివరాలు మార్చుకోవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి మనకి నచ్చిన సార్లు మార్చుకుంటే కుదరదు. ఖాతాదారు పేరుని ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. పేరుతో పాటు ఖాతాదారుడి లింగం డేట్ అఫ్ బర్త్ తల్లిదండ్రుల పేరు రిలేషన్షిప్ వంటివి ఒకసారి మార్చుకోవడానికి అవుతుంది.

Also read: White rice: వైట్ రైస్ తినకపోవడం వల్ల ప్రయోజనమా? హానికరమా?

వివాహ స్థితికి సంబంధించి గరిష్టంగా రెండు సార్లు మార్చుకోవచ్చు అలానే డేటాఫ్ జాయినింగ్ డేట్ అఫ్ లీవింగ్ ఉద్యోగం ని వదిలేయడానికి కారణాలు నేషనలాటీ ఆధార్ కార్డ్ నెంబర్ వంటిది ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి అవుతుంది. ఇక్కడ ఉన్న 11 అంశాలలో ఒకేసారి ఐదు వరకు సవరణని అభ్యర్థించవచ్చు ఒకేసారి జాయింట్ డిక్లరేషన్ ద్వారా అన్ని మార్పులు చేస్తే అది మోసాలకి దారి తీయవచ్చు. లేదంటే పూర్తిగా ఖాతా వివరాలు మారిపోవచ్చని ఈపీఎఫ్ఓ హెచ్చరిస్తోంది. జాయింట్ డిక్లరేషన్ ప్రాసెసింగ్ కోసం మార్చి 11 జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం 5 నిమిషాల కన్నా ఎక్కువ మార్పులు చేయాల్సి వచ్చినప్పుడు ఓవైసీ పరిశీలిస్తుంది (EPFO).

Join WhatsApp