Again Special FD scheme is available

EPFO New Rules : ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీనిని నిర్వహిస్తుంటుంది అయితే ఇందులో భాగంగా ఉద్యోగి ప్రతి నెల వేతనం నుండి 12% కట్ చేసే పిఎఫ్ అకౌంట్ లోకి వెళతాయి. సంస్థ కూడా అంతే మొత్తాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది దీనికి కేంద్రం వడ్డీ కలిపి ప్రతి ఆర్ధిక సంవత్సరం చివర్లో జమ చేస్తూ ఉంటుంది ప్రస్తుతం పీఎఫ్ వడ్డే రేట్లు 8.15 శాతంగా ఉంది కిందటి ఆర్థిక సంవత్సరానికి గాను దీనిని 8.25 శాతానికి పెంచేందుకు ఈపీఎఫ్ఓ నిర్ణయించిన కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు.

EPFO New Rules

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వృద్ధాప్యంలో ఉద్యోగులకి సురక్షిత జీవితం అందించే ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది దేశంలో ప్రతి ఉద్యోగి దీంట్లో సభ్యుడుగా చేరవచ్చు ఈఏపీఎఫ్ఓ సభ్యుడుకి ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ని ఇస్తుంది ఈ నెంబర్ కింద పిఎఫ్ అకౌంట్ లోనే పిఎఫ్ డబ్బులు ని జమ చేస్తూ ఉంటుంది. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనే అంటే ఏప్రిల్ ఒకటి నుండి ఈపీఎఫ్ నిబంధనలో మార్పులు చేసింది.

Also read: Silver Anklets: మహిళలు కాళ్లకు ధరించే వెండి పట్టీలు ద్వారా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

కొత్త రూల్స్ తెచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం రాగానే ఈపీఎఫ్ఓ రూల్స్ మారాయి ముఖ్యంగా ఉద్యోగి ఉద్యోగం మారితే అతని పిఎఫ్ అకౌంట్ బదిలీ చేయడానికి మాన్యువల్ ఫారం నింపి దానికోసం అప్లై చేయాలి. ఇప్పుడు అవసరం లేకుండా ఉద్యోగ సంస్థ నుండి ఇంకో సంస్థకి మారినా కూడా ఆటోమేటిక్ గానే కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ అవుతుంది దీంతో ఇక ఉద్యోగి మారినా కూడా సమయంలో మ్యాన్యువల్ గా పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేయాల్సిన పనిలేదు. పాత సంస్థ నుండి ఈపీఎఫ్ బ్యాలెన్స్ కూడా నేరుగా కొత్త సంస్థ లోకి అకౌంట్లోకి మారిపోతుంది. 36 నెలలపాటు ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ కాలేదంటే దానిని ఇనాక్టివ్ అకౌంట్ గా పరిగణిస్తారు (EPFO New Rules).

Again Special FD scheme is available
Join WhatsApp