How many crores Mukesh Ambani donated to Ayodhya Ram Mandir?

Mukesh Ambani: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్స కార్య‌క్ర‌మం జ‌న‌వ‌రి 22న‌ అట్ట‌హాసంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. వేద పండితుల మంత్రోచ్ఛారణల మ‌ధ్య దివ్యమందిరంలో ఆ బాల రాముడు కొలువుతీరాడు. శ్రీ‌రామ‌చంద్రుడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని దేశ, విదేశాల్లో ఉన్న రామ‌భ‌క్తులంతా తిల‌కంచారు. ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ సోమ‌వారం జ‌ర‌గ‌గా.. మంగళవారం నుంచి సాధారణ భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు.

How many crores Mukesh Ambani donated to Ayodhya Ram Mandir?

దీంతో రాముడిని దర్శించుకునేందుకు భ‌క్తులు అయోధ్య‌కు పోటెత్తుతున్నారు. సోమ‌వారం అర్థ‌రాత్రి నుంచే ఆల‌య ప్రాంతమంతా భక్తజనసంద్రోహంగా మారింది. ఇక‌పోతే రామమందిర ప్రారంభోత్సవానికి రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులతో పాటు మఠాధిపతులు, రాయబారులెంద‌రో హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. అప‌ర కుభేరాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కూడా త‌న ఫ్యామిలీతో క‌లిసి అయోధ్య‌కు వ‌చ్చారు.

ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, కుమార్తె ఇషా అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమల్, కొడుకు ఆకాష్ అంబానీ-అనంత్ అంబానీ, కోడ‌ల్లు శ్లోక-రాధిక బాల రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక‌కు హాజ‌రు అయ్యారు. హై సెక్యూరిటీతో అంబానీ ఫ్యామిలీ శ్రీ‌రాముల వారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చారు. అంతా ఎంతో ఉత్సంగా క‌నిపించారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.(Mukesh Ambani)

Also Read: Business Tips: బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

అయితే ఇప్పుడు అయోధ్య రామమందిరానికి ముఖేష్ అంబానీ ఇచ్చిన విరాళం ఎంతో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అత్యంత ధ‌న‌వంతుడైన‌ ముఖేష్ అంబానీ రామమందిరం ట్రస్టుకు రూ. 2.51 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా దేశ, విదేశాల నుంచి ఆలయ నిర్మాణానికి దాదాపు 3 వేల కోట్ల‌కు పైగా విరాళాలు వ‌చ్చాయి. మొత్తం 2.77 ఎకరాల స్థలంలో అయోధ్య రామ మందిరం నిర్మితం అయింది. 3 అంతుల్లో ఆల‌య నిర్మాణం జ‌రుగుతోంది. ఇంకా నిర్మాణ ప‌నులు జ‌రుగుతూనే ఉన్నాయి.

Join WhatsApp