PPO Number: టాక్స్ రూల్స్ లో ఇటీవలే మార్పులు అనేక మంది పెట్టుబడిదారులు పన్ను చెల్లింపు దారులు తమ ఆదాయంలోని కొంత భాగాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకి కేటాయించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీని ద్వారా పన్ను ఆదా ప్రయోజనాలని పొందుతున్నారు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్న వ్యక్తులు పదవి విరమణ తర్వాత పెన్షన్ పంపిణీ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలి. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇతర సంబంధిత ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ పెన్షనర్లకి ఈ పిపిఓ నెంబర్ అనేది చాలా ముఖ్యమైనది ఈపీఎఫ్ స్కీం లోని నిబంధనలు ప్రకారం ఒక్కో పెన్షనర్ కి ప్రత్యేక 12 అంకెల ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది.

PPO Number easy way to get

పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ ఉంటేనే పెన్షన్ తీసుకోవడానికి అవుతుంది ప్రతి ఎటా లైఫ్ సర్టిఫికెట్ ని సమర్పించాలి దాని కోసం పిపిఓ నెంబర్ కావాల్సి ఉంటుంది. పిపిఓ నెంబర్ అనేది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో జరిగి అన్ని రకాల ట్రాన్సాక్షన్లు వలన ఇతర కమ్యూనికేషన్ల రిఫరెన్స్ నెంబర్ పనిచేస్తుంది పెన్షనర్లు తమ పెన్షన్ పొందడానికి మానిటర్ చేయడానికి నెంబర్ తప్పనిసరి ఈపీఎఫ్ఓ ఏదైనా కంప్లైంట్ సమర్పించడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.

Also read: Fridge water: ఫ్రిజ్లో వాటర్ తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి ముప్పు తప్పదు..!

పాత బ్యాంక్ ఖాతా క్లోజ్ చేసి కొత్త కథను ఇవ్వాలన్న పిపిఓ నెంబర్ అవసరం మరి ఇంత ముఖ్యమైన నెంబర్ మర్చిపోతే ఎలా ఈ నెంబర్ ని మనం ఎలా పొందొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.. ఈపీఎప్ఓ అధికారిక వెబ్‌సైట్ www.epfindia.gov.in లోకి లాగిన్ కావాలి. ఇక్కడ ఆన్‌లైన్ సర్వీస్ సెక్షన్ లోకి వెళ్లి ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి ఆ తర్వాత పెన్షన్ పోర్టల్ పై క్లిక్ చేయాలి. స్క్రీన్ పై వెల్‌కమ్ టూ పెన్షనర్ పోర్టల్ ఉంటుంది. దాని తర్వాత నో యువర్ పీపీఓ నంబర్ పై క్లిక్ చేయాలి.బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా పీఎఫ్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. పూర్తి సమాచారం ఎంటర్ చేసినాక మీకు పీపీఓ నంబర్, మెంబర్ ఐడీ, పెన్షన్ టైప్ వంటి వివరాలు కనిపిస్తాయి. లేదంటే ఉమాంగ్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు (PPO Number).

Join WhatsApp