How To Start A Spices Business?

Spices Business: చాలా మందికి సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని ఉంటుంది. కానీ ఎలాంటి బిజినెస్ చేయాలి..? ఎంత బ‌డ్జెట్ అవుతుంది..? అస‌లు బిజినెస్ ఎలా ప్రారంభించాలి..? వంటి విష‌యాల‌పై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో వెన‌కడుగు వేస్తుంటారు. మీరు ఈ జాబితాలో ఉన్నారా.. అయితే ఇప్పుడు ఇచ్చే ఇన్ఫ‌ర్మేష‌న్ మీకు క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బిజినెస్ ఏదైనా స‌రే అది లాభ‌దాయ‌కంగా ఉండేలా చూసుకోవాలి. అలాంటి వాటిల్లో మ‌సాలా దినుసుల బిజినెస్ ఒక‌టి.

How To Start A Spices Business?

ఏడాది పొడ‌వునా మంచి డిమాండ్ ఉండే బిజినెస్ ఇది. సీజ‌న్ తో పని లేకుండా దాదాపు ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ నిత్యం మ‌సాలా దినుసుల‌ను విరివిరిగా వాడుతుంటారు. అందువ‌ల్ల మీరు ఎలాంటి భ‌యం లేకుండా ఈ వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. హోల్‌సేల్‌గా మ‌సాలా దినుసుల‌ను కొనుగోలు చేసి ఒక గ‌దిలో స్టోర్ చేసుకోవాలి. ఇందుకు ఒక గ‌ది అవ‌స‌రం అవుతుంది. ఆపై గిట్టుబాటు అయ్యే ధ‌ర‌కు చిన్న చిన్న దుకాణాలకు సరఫరా చేయొచ్చు.

Also Read: Mukesh Ambani: అయోధ్య రామమందిరానికి అప‌ర కుభేరులు ముఖేష్ అంబానీ ఎన్ని కోట్లు విరాళంగా ఇచ్చారో తెలుసా?

అలాగే మీరు మసాలా మేకింగ్ యూనిట్ ను కూడా స్టార్ట్ చేయ‌వ‌చ్చు. కొంచెం త‌క్కువ ధ‌ర‌కు మ‌సాలా దినుసుల‌ను తెచ్చుకుని.. చికెట్ మ‌సాలా, మ‌ట‌న్ మ‌సాలా, ఫిష్ మ‌సాలా, గరం మసాలా, తందూరి మసాలా, బిర్యానీ మసాలా, చాట్ మసాలా, సాంబార్ మసాలా వంటి ర‌క‌ర‌కాల మ‌సాలా పౌడ‌ర్స్ త‌యారు చేసి విక్ర‌యించ‌వ‌చ్చు. స్థానికంగా తయారయ్యే మసాలాలకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ పెరిగింది.(Spices Business)

How To Start A Spices Business?

మీరు మీరు మ‌సాలా దినుసుల‌ను మ‌రియు మ‌సాలా పౌడ‌ర్స్ ను దుకాణాల ద్వారానే కాకుండా ఆన్‌లైన్ ద్వారా విక్ర‌యించే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ బిజినెస్‌లో నష్టం అనే మాటే ఉండదు. మార్కెటింగ్ ట్రిక్స్‌, బ్రాండింగ్, ప్ర‌మోష‌న్ వంటివి పాటిస్తే.. ఈ వ్యాపారం సూప‌ర్ గా క్లిక్ అవుతుంది. బ‌డ్జెట్ విష‌యానికి వ‌స్తే.. త‌క్కువ‌లో త‌క్కువ రూ. 3.5 లక్షలు బ‌డ్జెట్ అవ‌స‌రం అవుతుంది. మసాలా దినుసులు గ్రైండింగ్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి కొన్ని యంత్రాలు అవ‌స‌రం అవుతాయి. చిన్న‌గా ప్రారంభించి ఆ త‌ర్వాత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటే ల‌క్ష‌ల్లో ఆదాయం ప‌క్కా వ‌స్తుంది.

Join WhatsApp