LIC's Special Scheme for Women

LIC New Policy: చాలా మంది ఈ రోజుల్లో డబ్బులని ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఫ్యూచర్ ని దృష్టి లో పెట్టుకుని నచ్చిన విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్త పాలసీని తీసుకు రావడం జరిగింది. ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ (LIC Index Plus) పేరు తో కొత్త యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ని తెస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఎల్ఐసీ జారీ చేసిన బీఎస్ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీ విక్రయాలు 2024, ఫిబ్రవరి 6వ తేదీ నుంచే మొదలు అయ్యాయి.

LIC New Policy LIC Index Plus full details

అంటే మంగళవారమే అంటే ఈరోజే ఈ పాలసీని లాంఛ్ చేస్తోంది. యూనిట్ లింక్డ్ పాలసీల ద్వారా లైఫ్ కవర్ తో పాటు గా మీరు మీ దీర్ఘకాలికి లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు పెట్టుబడులు పెడుతుంది సంస్థ. ఒకే పాలసీ తో డబుల్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఎల్ఐసీ ఇండెక్స్ ఫండ్ ప్లాన్ అనేది ఒక యూనిట్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యూవల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఫిబ్రవరి 6వ తేదీన లాంఛ్ చేస్తున్నారు. దేశీయ కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ అవుతుంది.

Also read: Face: అందమైన స్కిన్ ని పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయిపోండి..!

ఈ పాలసీ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తో పాటు టర్మ్ ముగిసే దాకా సేవింగ్స్ జరుగుతాయి. కనీసం 90 రోజుల నుంచి 50 లేదా 60 ఏళ్ల వయసు వరకు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీస మెచ్యూరిటీ వయసు 18 ఏళ్లు. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 75 లేదా 85గా ఉంది. కనీస ప్రీమియం రేంజ్ ఏడాదికి రూ.30 వేలు. 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత పెట్టుబడి పెట్టిన యూనిట్స్ లో మీకు నచ్చినంత విత్ డ్రా చేసుకోవచ్చు (LIC New Policy) .

LIC's Special Scheme for Women
Join WhatsApp