Again Special FD scheme is available

New Rules: ప్రతినెలా కూడా ఒకటో తారీఖున కొన్ని కొత్త రూల్స్ వస్తూ ఉంటాయి. వాటిని తెలుసుకోకపోతే అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఎప్పటిలానే ఈసారి కూడా కొన్ని రూల్స్ లో మార్పులు వచ్చాయి. ఏప్రిల్ 1వ తేదీ నుండి కొన్ని పనులు కచ్చితంగా చేయాలి ఏప్రిల్ ఒకటి నుండి రాబోతున్న కొత్త రూల్స్ గురించి చూద్దాం నేషనల్ పెన్షన్ సిస్టం లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులర్ డెవలప్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పాస్వర్డ్ ఆధారంగా సిఆర్ఏ సిస్టం లోకి లాగిన్ అవుతున్న వాళ్లకి ఇక మీదట అథెండికేషన్ అమల్లోకి రానుంది అంటే పాస్వర్డ్ తో పాటుగా ఆధార్ ఆధారిత అథెండికేషన్ తప్పనిసరి కాబోతోంది. ఈ రూల్ ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తుంది.

New Rules from April 1st

మార్చి 15 దీని మీద సర్కిల్ ని జారీ చేశారు ఇది ఇలా ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. పలు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు ద్వారా చేసే రెంట్ పేమెంట్ ల మీద రివార్డు పాయింట్ల ని తొలగిస్తున్నట్లు చెప్పింది. ఈ కొత్త రూలు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రాబోతోంది ఆరమ్, ఎస్బిఐకార్డ్ ఎలైట్, ఎస్బిఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్ ఇలాంటి కార్డులు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ విషయం చూసుకోండి. ఎస్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఒక త్రైమాసికంలో 10000 అంతకు మించి ఖర్చు చేస్తే ఒక కాంప్లెమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ని కల్పిస్తున్నట్లు చెప్పింది.

Also read: BJP: బీజేపీ ఐదవ జాబితా వచ్చేసింది.. ఆ హీరోయిన్ కి ఎంపీ టికెట్..!

గత త్రైమాసికంలో చేసిన ఖర్చుల్ని సైతం తదుపరి త్రైమాసికంలో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఓలా మనీ ఇటీవలే ప్రకటన చేసింది పిపిఐ వాలెట్ సర్వీసుల్లోకి ఎలక మార్పులు చేస్తున్నట్లు చెప్పింది గరిష్ట వాలెట్ లోడ్ నెలకు పదివేలుగా నిర్ణయించింది కొత్త రూల్స్ ఏప్రిల్ ఒకటి నుండి అమలులోకి వస్తాయని చెప్పింది (New Rules).

Again Special FD scheme is available
Join WhatsApp