RBI sanctions on Paytm Payments Bank

RBI: పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లో అకౌంట్ ఉందా..? ఈ ఖాతా ఉన్న వారికి బిగ్ అలర్ట్. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూస్తే.. డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ ట్రాన్సాక్షన్ల వంటి బ్యాంకింగ్ సేవలను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ఉల్లంఘన నేపథ్యం లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, టాపప్స్ తో పాటు ప్రీపెయిడ్ సాధనాలైన వాలెట్స్, ఫాస్టాగ్ వంటి సేవలు అలానే ఆర్‌బీఐ ఆదేశాలతో డిపాజిట్లు తీసుకోవడం ఫిబ్రవరి 29 తర్వాత నిలిచిపోనున్నాయి.

RBI sanctions on Paytm Payments Bank

అంటే 2024, మార్చి 1 నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ సేవలన్నీ ఆగిపోనున్నాయి. కస్టమర్లు ఖాతాల్లోను బ్యాలెన్స్‌ను వినియోగించుకునేందుకు ఆంక్షలు లేవని ఆర్‌బీఐ చెప్పింది. సేవింగ్స్, కరెంట్ ఖాతా ల్లోని లిమిట్ ప్రకారం ఎటువంటి ఆంక్షలు లేకుండా తీసుకో వచ్చని అంది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పీబీబీఎల్ నోడల్ అకౌంట్లను రద్దు చేస్తున్నారట. ఈ విషయాన్నీ కూడా ఆర్బీఐ చెప్పింది.

Also read: Health: ఎండు ద్రాక్షాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

మానిటరీ పాలసీలు, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను పాటించని కారణం గానే ఈ నిర్ణయం తీసుకుంది అని ఆర్‌బీఐ అంది. నిర్దేశించిన తేదీ తర్వాత కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ వ్యాలెట్, ఫాస్టాగ్ మొదలైన డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, టాప్ అప్ కి అనుమతి లేదు. క్రెడిట్ అయ్యే వడ్డీ, క్యాష్ బ్యాక్, ఇతర రీఫండ్లకు మినహా ఉంటుంది. ప్రీపెయిడ్, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు అలానే సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు వంటి వాటితో సహా బ్యాంక్ ఖాతాదారులకు బ్యాలెన్స్ నుంచి విత్ డ్రా లేదంటే ఎవరైనా వినియోగించడానికి ఎలాంటి పరిమితులు లేవు అని చెప్పింది ఆర్‌బీఐ (RBI).

Join WhatsApp