Do You Have An SBI Account

SBI: దేశీయ దగ్గర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ప్రత్యేకంచే పరిచయం చేయక్కర్లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల స్కీం లను తీసుకువస్తూ ఉంటుంది చాలా మంది కస్టమర్లు ఈ స్కీం ల ద్వారా బెనిఫిట్స్ ని పొందుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ వడ్డీని అందిస్తూ కస్టమర్ల కోసం స్పెషల్ ఫిక్స్ డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చింది ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పోతే వివరాలను చూద్దాం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక వడ్డీ ని ఆఫర్ చేస్తూ కస్టమర్ల కోసం స్పెషల్ డిపాజిట్ పథకాలను తీసుకువస్తోంది వీటిల్లో ఒకటి ఎస్బిఐ అమృత్ కలష్ ఒకటి. కస్టమర్ల కోసం ఈ ప్రత్యేక పథకం అందుబాటులో ఉంటుంది.

SBI special scheme

ఇప్పటికే పలుమార్లు ఈ పథకం గడువుని పొడిగించింది ఇప్పుడు 2024 మార్చి 31 వరకు ఈ స్కీము అందుబాటులో ఉంది ఈ స్కీమ్ లో రెండు కోట్లకి లోబడిన డిపాజిట్లు చేయడానికి అవకాశం ఉంది. డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లు కొత్త రెన్యువల్ డిపాజిట్లు టర్మ్ డిపాజిట్ అండ్ స్పెషల్ టైం డిపాజిట్లు చేయొచ్చు. ఈ స్పెషల్ స్కీం కాల పరిమితి 400 రోజులుగా ఉంది రెగ్యులర్ సిటిజన్లకి పథకం ద్వారా 7.1.0% వడ్డీ వస్తుంది సీనియర్ సిటిజెన్లకు అయితే 7.60 శాతం వడ్డీ వస్తుంది వీరికి సాధారణ ప్రజల కంటే 50 బేసిస్ పాయింట్ల మీద వడ్డీ ఎక్కువ వస్తుంది.

Also read: Screen Guards: ఆ స్క్రీన్‌గార్డుల విషయంలో జాగ్రత్త.. వినియోగదారులకు ఎంఐ హెచ్చరిక..!

టర్మ్ డిపాజిట్ ల పై నెలవారీగా త్రైమాసికానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి చొప్పున వడ్డీ కస్టమర్లకి వస్తుంది. స్పెషల్ టర్మ్ డిపాజిట్లపై మెచ్యూరిటీ పొందుతారు ఎకౌంట్లోనే క్రెడిట్ అవుతాయి. ఈ స్కీంలో చేరాలంటే నేరుగా బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి సంప్రదించొచ్చు లేదా ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎస్బిఐ యోనో చానల్స్ ద్వారా కూడా మీరు చేయవచ్చు. లక్ష రూపాయలు డిపాజిట్లు చేస్తే 400 రోజులు కి వడ్డీ రేటుతో చూస్తే వడ్డీ రూ. 7743 వస్తుంది. మొత్తం చేతికి రూ. 1,07,743 వస్తుంది. అదే సీనియర్ సిటిజెన్లు అయితే 7.60 శాతం వడ్డీ రూ. 8,292 వడ్డీ పొందుతారు. మొత్తం చేతికి రూ. 1,08,292 అందుకుంటారు (SBI).

Do You Have An SBI Account
Join WhatsApp