Again Special FD scheme is available

SCSS: కేంద్రం చాలా రకాల స్కీములను తీసుకువచ్చింది కేంద్రం అందిస్తున్న స్కీముల వలన చాలా మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది ఏళ్ళ కాలంలో ఎన్నో పథకాలను ప్రారంభించింది వేరు వేరు వర్గాల వాళ్ళకి వేరు వేరు పథకాలని కూడా ప్రవేశపెట్టింది కేంద్రం. వీటిలో సీనియర్ సిటిజన్ కి ప్రత్యేకించి పలు పథకాలను తీసుకురావడం కూడా జరిగింది. సీనియర్ సిటిజన్లకి సంబంధించి గొప్ప పథకం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం. దీంట్లో 60 ఏళ్లకి పైబడిన వాళ్ళు లేదంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు 55 ఏళ్లు పైబడిన వాళ్ళు మిలిటరీ పని చేసి రిటైర్ అయిన వాళ్ళు ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు.

SCSS: senior citizen savings scheme full details

కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి గ్యారెంటీ రిటర్న్స్ ని కచ్చితంగా అందుకోవచ్చు ఎలాంటి రిస్క్ కూడా ఉండదు వస్తే రాబడి ఉంటుంది ఇక ఎంత పెడితే ఎంత వస్తుంది అనే విషయాలని కూడా చూసేద్దాం. దీనిలో గరిష్టంగా రూ. 30 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. గతంలో రూ. 15 లక్షలుగా ఉండగా 2023 బడ్జెట్ సమయంలో రూ. 30 లక్షలకు పెంచింది. అకౌంట్ హోల్డర్ చనిపోయిన పక్షంలో జీవిత భాగస్వామి లేదా జాయింట్ హోల్డర్ లేదా నామినీ అకౌంట్ ని నడిపించచ్చు.

Also read: Best Gaming Phones: గేమింగ్ లవర్స్ కోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్స్..!

కనీసం రూ. 1000 డిపాజిట్‌తో కూడా ఈ పథకం ప్రారంభించొచ్చు. గరిష్టంగా రూ. 30 లక్షలు వరకు మీరు పెట్టుకోవచ్చు. మధ్యలో ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాలపరిమితి ఐదేళ్లుగా ఉంటుంది. అవసరమైతే మరో మూడేళ్లు ఎక్స్టెండ్ చెయ్యచ్చు కూడా. గుర్తింపు పొందిన ఏ బ్యాంకులోనైనా ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. పోస్టాఫీసుల్లో కూడా దీన్ని మీరు ఓపెన్ చెయ్యచ్చు. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా వుంది. రూ. లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే 8.20 శాతం వడ్డీ ప్రకారం చూస్తే… మెచ్యూరిటీకి (ఐదేళ్లకు) రూ. 1,41,000 వస్తుంది. దీనిలో వడ్డీనే రూ. 41000 (SCSS).

Again Special FD scheme is available
Join WhatsApp