State Bank Given Warning to Employees

State Bank: బ్యాంకులు కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని ఇస్తూ ఉంటాయి. బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ మొదలు పాస్‌బుక్, క్రెడిట్ కార్డు, లోన్లు ఇలా అనేక సేవలు ని అందిస్తూ ఉంటాయి. అయితే వీటిల్లో ఏటీఎం కార్డు ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు కస్టమర్స్ నుండి ఇలా వసూలు చేస్తుంటాయి. ఈ డబ్బులు ఆటోమేటిక్‌గా బ్యాంకులు మన అకౌంట్లో నుండి కట్ చేస్తుంటాయి. అయితే ఈ అమౌంట్ అకౌంట్లో డబ్బులు కట్ అయితే ఏదో ఛార్జీ అని వదిలేస్తుంటాం పట్టించుకోం.

State Bank Given Warning to Employees

కానీ గత కొంత కాలంగా ఇంకా వేరే కారణాలతో అకౌంట్లో నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు ని కట్ చేస్తున్నాయి బ్యాంకులు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ప్రభుత్వ బీమా పథకాల పేరు తో బ్యాంకులు డబ్బులు ని కట్ చేస్తున్నాయి. తమకు తెలియకుండానే ఇన్సూరెన్స్ స్కీమ్స్ పేరిట డబ్బులు కట్ అవుతున్నాయని పలువురు కస్టమర్లు బ్యాంకుల్లో కంప్లైంట్ ఇచ్చారు.

Also Read: EV Production: బడ్జెట్‌లో EVల తయారీకి బూస్టింగ్‌ ఇస్తారా..?

ఎస్‌బీఐ కస్టమర్లకే ఈ సమస్యలు వస్తున్నాయ్. ఇది వరకు కూడా కస్టమర్లు ఇలాంటి ఫిర్యాదులు చేసారు. దీని పై ఎస్‌బీఐ స్పందించింది. కస్టమర్ల సమ్మతితోనే ఇలా జరుగుతుందని తాము ఉన్నత ప్రమాణాలు పాటిస్తామని స్టేట్ బ్యాంక్ అంది. ఈ విషయం మీద ఫిర్యాదులు చెయ్యాలంటే, ఒక పోర్టల్ కూడా తీసుకొచ్చింది. https://crcf.sbi.co.in/ccf లింక్ ద్వారా నేరుగా కస్టమర్ ఫిర్యాదు చెయ్యచ్చు.

Join WhatsApp