Union Budget 2024 Date, Time and Key Expectations

Union Budget 2024: కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాది బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. అయితే, కేంద్ర బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెడతారు అనే విషయాలను ఇప్పుడే చూసేద్దాం. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను తీసుకు వస్తున్నా విషయం తెలిసిందే. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు కనుక కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1, 2024 రోజున బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది కేంద్రం.

Union Budget 2024 Date, Time and Key Expectations

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే దాకా ప్రభుత్వాన్ని నడిపించే ఆర్థిక ప్రణాళిక బడ్జెట్. 2024-25 ఆర్థిక ఏడాది మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆదాయం, వ్యయాల ప్రణాళికలను చెప్పనున్నారరు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి చివరి వారంలో మొదలై ఏప్రిల్‌లో ముగుస్తాయి.

Also Read: Apples: యాపిల్స్ ని ఎక్కువగా తినవచ్చా? తింటే ఏమవుతుంది?

రైతులకి పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచునున్నారని తెలుస్తోంది. మహిళా రైతులకు పెట్టుబడి సాయం రూ.12 వేలు చెయ్యచ్చు. ఉద్యోగులు, పెన్షనర్లకు కరోనా వైరస్ విజృంభణ సమయంలో పెండింగ్ పెట్టిన డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ల18 నెలల బకాయిలు విడుదల చెయ్యచ్చు. (Union Budget 2024)

Join WhatsApp