RBI sanctions on Paytm Payments Bank

UPI New Rules : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్స్ ని చేస్తున్నారు. క్యాష్ పేమెంట్లు బాగా తగ్గిపోయాయి. రోజువారి జీవితంలో ఇప్పుడు యూపీఐ అనేది అంతర్భాగంగా మారింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చొరవతో ఎన్నో సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి. యూపీఐ పేమెంట్స్ విధానంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్లని అందిస్తున్నటువంటి సంస్థల వాలెట్లలో ఉన్న డబ్బులతో యూపీఐ పేమెంట్ ల విషయంలో మాత్రం కొన్ని పరిమితులు ఉన్న విషయం తెలిసిందే. ఈ సమస్యని పరిష్కరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలు తీసుకొచ్చింది.

UPI New Rules from RBI

ఇకనుండి పీపీఐ లను థర్డ్ పార్టీ అప్లికేషన్లతో అనుసంధానం చేసేందుకు వీలు కల్పించాలని అంది ప్రీపెయిడ్ పేమెంట్స్ సాధనాల్లో మనం ముందుగానే కొంత డబ్బు జమ చేసి పెట్టుకోవచ్చు. వీటిని వాలెట్స్ లేదా ప్రీపెయిడ్ కార్డులుగా చెప్పొచ్చు. యూపీఐ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకి పేమెంట్ చేయొచ్చు పిపిఐ లో ఉన్న డబ్బు మేరకు బ్యాంక్ అకౌంట్ సంబంధం లేకుండానే ఖర్చు చేయొచ్చు. పీపీఐ అందిస్తున్న సంస్థకి చెందిన యూపీఐ ద్వారానే ఈ పేమెంట్ చేసేందుకు వీలవుతుంది.

Also read: Bandi Sanjay : ఇండియన్ పొలిటికల్ లీగ్ లో కప్ మోడీదే..!

ఇకనుండి ఏదైనా యూపీఐ అప్లికేషన్ అనుసంధానం చేసి చెల్లింపులు జరిపేందుకు వీలవుతుంది. దీని వలన పిపిఐ వినియోగదారులకు ఇంకా ఈజీ అవుతుంది ఉదాహరణకి ఫోన్ పే వాలెట్లో కొంత మొత్తం వేశారని అనుకుంటే ఇప్పటిదాకా సంస్థ యూపీఐని వాడినప్పుడే ఆ మొత్తాన్ని పేమెంట్స్ కోసం వాడుకునే వీలు ఉంటుంది. ఇతర యూపీఐ యాప్స్ వాడి ఫోన్ పే వాలెట్ లోని డబ్బు తో పేమెంట్ చేయొచ్చు పీపిఐ వాలెట్ అందిస్తున్న సంస్థ పైన పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు ఇతర యూపీ అప్లికేషన్లతో వాడుకోవచ్చు (UPI New Rules).

RBI sanctions on Paytm Payments Bank
Join WhatsApp