Election Commission Released AP Voter Final List 2024

Voter Id Card Download : ఓటర్ ఐడి కార్డు ఎంత ముఖ్యమో మనకి తెలుసు ఓటర్ ఐడి కార్డ్ లేకపోతే ఓటు వేయడానికి అవ్వదు. పైగా ఓటర్ ఐడి కార్డు వలన అనేక లాభాలు ఉన్నాయి. చాలా వాటికి ఓటర్ ఐడి కార్డు ప్రూఫ్ గా కూడా పనిచేస్తుంది. ఇక ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఓటర్ ఐడి కార్డ్ ఉంటేనే ఓటు వేయడానికి అవుతుంది. ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదా ఓటర్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం ఒకటే ప్రాసెస్ దీనికోసం మీరు సైబర్ కేఫ్ కి మీసేవ ఆన్లైన్ సెంటర్లకి వెళ్ళక్కర్లేదు. ఓటర్ కార్డ్ లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీ ఓటర్ ఐడి కార్డ్ కనుక లేకపోతే ఇలా చేయడం మంచిది.

Voter Id Card Download process

ఎన్నికల సంఘం ప్రజలకి ఓటర్ కార్డుని డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఇస్తోంది మీరు కావాలంటే మీ ఓటర్ కార్డ్ ని డిజిటల్ కాపీ డౌన్లోడ్ చేయొచ్చు. డిజిటల్ ఓటర్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ గురించి ఇప్పుడు చూద్దాం. ఓటర్ ఐడి కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ముందు మీరు వెబ్‌సైట్ https://voterportal.eci.gov.in లేదా https://old.eci.gov.in/e-epic/ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి. దీనికోసం కచ్చితంగా ఎన్విఎస్పి పోర్టల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి ఇక్కడ అవసరమైన వివరాలని ఇవ్వాలి.

Also read: Revanth Reddy: రాజ్యాంగాన్ని రక్షించాలి అంటే.. రాహుల్ ప్రధాని కావాలి..!

ఆ తర్వాత మీరు లాగిన్ చేయొచ్చు ఇప్పుడు మీ ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ ని ఎంటర్ చేయండి. నెంబర్ని నమోదు చేసి రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది ఇప్పుడు మీరు ఓటీపీని ఇచ్చేయండి. తర్వాత ఓటర్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకునే ఎంపిక మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ ఈ పిక్ మీద క్లిక్ చేస్తే ఓటర్ కార్డు పిడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది డిజిటల్ ఓటర్ కార్డ్ సాయంతో డూప్లికేట్ ఐడి కార్డ్ ని తయారు చేసుకోవచ్చు పైగా చిరునామని మార్చుకోవడానికి కూడా అవుతుంది (Voter Id Card Download).

Election Commission Released AP Voter Final List 2024
Join WhatsApp