Again Special FD scheme is available

Women Savings: చాలామంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డబ్బులు ఆదా చేస్తూ ఉంటారు. ఏదైనా స్కీముల్లో వాటిల్లో పొదుపు చేస్తూ ఉంటారు. మహిళలని పొదుపు మీదకి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలని అందిస్తోంది. వాటిల్లో మంచి ఆదరణ పొందిన కొత్త స్కీం మహిళా సేవింగ్స్ సర్టిఫికెట్. ఇక ఈ స్కీము కి సంబంధించి మరిన్ని వివరాలను చూద్దాం.. మహిళలు బాలికల కోసం ప్రత్యేకంగా కొత్త స్కీమ్ ని తీసుకువచ్చింది కేంద్రం. చిన్న మొత్తాల పొదుపు పథకం అయిన మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ద్వారా మంచి వడ్డీ రేటు కల్పిస్తోంది. ఈ పొదుపు పథకం మార్చి 2025 వరకు అందుబాటులో ఉంటుంది ఈ పథకంలో ఎంతవరకు గరిష్ట పరిమితి ఉంది ఎంత వడ్డీ వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Women Savings schemes from central government

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ ని తీసుకువచ్చింది మైనర్ బాలికల పేరుపై తీసుకునేందుకు కూడా అవకాశం ఉంది. వేరే వ్యక్తులు ఇందులో పెట్టుబడి పెట్టేందుకు వీలు కాదు సింగల్ ప్రీమియం పథకం ఇది అంటే ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టాలి కనీసం 1000 నుండి రెండు లక్షలు వరకు డిపాజిట్ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ లో ఈ ఖాతా ని తెరవాలి మెచ్యూరిటీ టెన్యూర్ రెండేళ్లు. 2025 మార్చి వరకు ఈ స్కీంలో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకం లో ప్రస్తుతం వడ్డీ 7.5% గా ఉంది.

Also read: Sleep: రోజంతా నిద్ర మత్తు మిమ్మల్ని వెంటాడుతుందా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

చిన్న మొత్తాల పొదుపు పథకాలలో అమ్మాయిలు కోసం తెచ్చిన సుకన్య సమృద్ధి యోజన లో 8.20% ఆ స్కీము తర్వాత మహిళలకు ఎక్కువ వడ్డీ వస్తున్న స్కీము అయితే ఇదే ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ముందుస్తగా పాక్షిక విత్ డ్రా చేయొచ్చు సుకన్య సమృద్ధి యోజన వంటి స్కీం లలో పన్ను మినహాయింపు ఉంటుంది. మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్ పై వచ్చే వడ్డీ ఆదాయంపై టిడిఎస్ వర్తిస్తుంది. పన్ను మినహాయింపు ని కల్పించలేదు ప్రభుత్వం ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ రేటు వస్తుంది ఇందులో స్థిరమైన వడ్డీ మీకు లభిస్తుంది (Women Savings).

Again Special FD scheme is available
Join WhatsApp