Reviews Archives - PakkaFilmy Telugu https://telugu.pakkafilmy.com/category/reviews/ Pakka Original News Thu, 14 Nov 2024 10:30:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7 https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/cropped-pakkafilmy-150-logo-32x32.jpg Reviews Archives - PakkaFilmy Telugu https://telugu.pakkafilmy.com/category/reviews/ 32 32 Kanguva Review: సూర్య భారీ యాక్షన్‌..విజువల్ మేజిక్.. “కంగువ” మూవీ రివ్యూ!! https://telugu.pakkafilmy.com/suriya-kanguva-movie-review/ https://telugu.pakkafilmy.com/suriya-kanguva-movie-review/#respond Thu, 14 Nov 2024 10:30:54 +0000 https://telugu.pakkafilmy.com/?p=13282 సినిమా: కంగువ (Kanguva Review)నటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులునిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్దర్శకత్వం: శివసంగీతం: దేవి శ్రీ ప్రసాద్కో ప్రొడ్యూసర్: నేహా జ్ఞానవేల్ రాజారిలీజ్ డేట్: 2024-11-14 Kanguva Review: సూర్య భారీ యాక్షన్‌..విజువల్ మేజిక్.. “కంగువ” మూవీ రివ్యూ!! తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో సూర్య. అయన హీరో గా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘కంగువ’.దిశా పటాని, యోగి […]

The post Kanguva Review: సూర్య భారీ యాక్షన్‌..విజువల్ మేజిక్.. “కంగువ” మూవీ రివ్యూ!! appeared first on PakkaFilmy Telugu.

]]>

సినిమా: కంగువ (Kanguva Review)
నటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం: శివ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కో ప్రొడ్యూసర్: నేహా జ్ఞానవేల్ రాజా
రిలీజ్ డేట్: 2024-11-14

Kanguva Review: సూర్య భారీ యాక్షన్‌..విజువల్ మేజిక్.. “కంగువ” మూవీ రివ్యూ!! తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో సూర్య. అయన హీరో గా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘కంగువ’.దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ అగ్రనటులు నటించిన ఈ సినిమా కి ప్రముఖ దర్శకుడు శివ దర్శకత్వం వహించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ: ఫ్రాన్సిస్ (సూర్య) పోలీసులు కూడా పెట్టుకోలేని క్రిమినల్స్ ను పట్టుకుని అప్పజెబుతుంటాడు. అతనితో పాటు ఏంజెల్ (దిశాపటాని) అదే పని చేస్తుంటాడు. రెండు వేరు వేరు గ్యాంగ్ లు గా ఉన్న వీరు ఒకప్పుడు ప్రేమికులు. విడిపోతారు. అయితే ఓ సారి ఓ కేసు నిమిత్తం ఒకరిని చంపేయాల్సి వస్తుంది ఫ్రాన్సిస్. అది ఓ చిన్నపిల్లాడు చూస్తాడు. అతన్ని చూడగానే ఫ్రానీస్ కి ఎక్కడో కలిసిన ఫీలింగ్. ఆ పిల్లాడిని ఓ గ్యాంగ్ వెంటాడుతుంది. అసలు ఆ గ్యాంగ్ ఎవరు? ఈ చిన్న పిల్లాడిని ఎందుకు వెంటాడుతున్నారు.? వీరికి 1100 వ కాలానికి చెందిన కంగువ (సూర్య) కి ఏం సంబంధం అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటులు: ఈ సినిమా లో సూర్య నటన హైలైట్. ఆయన ‘వన్ మ్యాన్ షో’ అని చెప్పవచ్చు.ఫ్రాన్సిస్, కంగువ పాత్రల్లో ఆయన ఒదిగిన తీరు చాలాబాగుంది. హీరోయిన్ పాత్రలో దీశా పటాని ఉన్నది కొద్దీ సేపే అయినా తన అందాలతో బాగానే అలరించింది. యాక్షన్ సీన్లు, ఎమోషన్ సీన్లలో తన అభినయంతో సినిమాకు ప్రాణం పోశాడు. పాత్రలు విభిన్నంగా ఉన్నప్పటికీ, సూర్య తన అనుభవంతో వాటిని చాలా బాగా పోషించాడు. బాబీ డియోల్ మరోసారి క్రూరమైన విలన్‌గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దర్శకుడు ఈ పాత్రను బాగా ఎలివేట్ చేశాడు. ఈ సినిమాలో వీరి తర్వాత ఓ బాలనటుడు తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రల్లో నటించిన వారు తమ స్థాయిలో మంచి నటన ప్రదర్శించారు, అయితే ప్రధానంగా కథ సూర్య చుట్టూ తిరుగుతుండడంతో, ఇతర పాత్రలకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది.

సాంకేతిక నిపుణులు: సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు కలిగిన చిత్రం కంగువ. కథా పరంగా డైరెక్టర్ శివ కృషి చాలా ఉంది. ముఖ్యమైన ఎపిసోడ్లలో శివ డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గురించి తప్పకుండా మాట్లాడాల్సిందే. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల గూస్‌బంప్స్ ని ఇస్తుంది. సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిస్వామి విజన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. రిచ్ విజువల్స్‌తో సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చాడునిర్మాతలు జ్ఞానవేల్ రాజా సారథ్యంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీగా ఖర్చు పెట్టారు, దాని ప్రభావం తెరపై సుస్పష్టంగా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

సూర్య నటన

యాక్షన్ ఎపిసోడ్స్

నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

కథనం కొంత గందరగోళంగా ఉండడం

తీర్పు: జాతి, ప్రాంతాల మధ్య ఆధిపత్య పోరాటం నేపథ్యంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా తెరకెక్కించారు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను కోరుకునే వారికి ఈ వారం ‘కంగువ’ మంచి సినిమా అవుతుంది.

రేటింగ్: 3.5/5

టాగ్ లైన్: భారీ యాక్షన్‌..విజువల్ మేజిక్..

The post Kanguva Review: సూర్య భారీ యాక్షన్‌..విజువల్ మేజిక్.. “కంగువ” మూవీ రివ్యూ!! appeared first on PakkaFilmy Telugu.

]]>
https://telugu.pakkafilmy.com/suriya-kanguva-movie-review/feed/ 0 13282
Appudo Ippudo Eppudo: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! https://telugu.pakkafilmy.com/nikhil-in-appudo-ippudo-eppudo-movie-review/ https://telugu.pakkafilmy.com/nikhil-in-appudo-ippudo-eppudo-movie-review/#respond Fri, 08 Nov 2024 17:23:41 +0000 https://telugu.pakkafilmy.com/?p=12776 సినిమా : అప్పుడో ఇప్పుడో ఎప్పుడోనటీనటులు:నిఖిల్,రుక్మిణి వసంత్,దివ్యాన్షా కౌశిక్,సత్య,సుదర్శన్,అజయ్ తదితరులుదర్శకుడు: సుధీర్ వర్మనిర్మాతలు: నరసింహ చారీ చెన్నోజు, నరసబాబు, బీవీఎస్ఎన్ ప్రసాద్సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్ఎడిటర్: నవీన్ నూలిమ్యూజిక్: కార్తీక్, సన్నీ ఎంఆర్బ్యానర్: ఎస్‌వీసీసీ, హైవే పిక్చర్స్ లిమిటెడ్, ఎల్ఎల్‌వీరిలీజ్ డేట్: 2024-11-08 Nikhil Siddharth in Appudo Ippudo Eppudo Movie Review Appudo Ippudo Eppudo: నిఖిల్ హీరో గా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ షూటింగ్ అవాన్తరాలతో ఇటీవలే […]

The post Appudo Ippudo Eppudo: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! appeared first on PakkaFilmy Telugu.

]]>
appudo ippudo eppudo review

సినిమా : అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
నటీనటులు:నిఖిల్,రుక్మిణి వసంత్,దివ్యాన్షా కౌశిక్,సత్య,సుదర్శన్,అజయ్ తదితరులు
దర్శకుడు: సుధీర్ వర్మ
నిర్మాతలు: నరసింహ చారీ చెన్నోజు, నరసబాబు, బీవీఎస్ఎన్ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలి
మ్యూజిక్: కార్తీక్, సన్నీ ఎంఆర్
బ్యానర్: ఎస్‌వీసీసీ, హైవే పిక్చర్స్ లిమిటెడ్, ఎల్ఎల్‌వీ
రిలీజ్ డేట్: 2024-11-08

Nikhil Siddharth in Appudo Ippudo Eppudo Movie Review

Appudo Ippudo Eppudo: నిఖిల్ హీరో గా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ షూటింగ్ అవాన్తరాలతో ఇటీవలే షూటింగ్ పూర్తయింది. చాలారోజులుగా విడుదలకు నోచుకుని ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ప్రమోషన్లు కూడా తక్కువగా నిర్వహించగా నేడు (నవంబర్ 08) థియేటర్లలో విడుదలైంది. కార్తికేయ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరో నిఖిల్ సినిమాకి ప్రేక్షకులనుండి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియాలంటే ఈ సమీక్షలో తెలుసుకుందాం..

కథ: హైదరాబాద్‌లో రేసర్ గా ఉన్న రిషి (నిఖిల్) తార (రుక్మిణి వసంత్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ క్రమంలో తార కూడా రిషి ని ప్రేమిస్తుంది. కానీ రిషి స్నేహితుడు (వైవా హర్ష) చేసిన తప్పు వల్ల వారిద్దరి ప్రేమ ఫలించదు. దాంతో రిషి లండన్ వెళ్ళిపోతాడు. అక్కడ తులసి (దివ్యాంశ) పరిచయం అవుతుంది, ఆమెతో ప్రేమలో పడిన రిషి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే, పెళ్లి ముహూర్తం సమయానికి తులసి కనిపించకుండా పోతుంది. ఆ తరువాత మళ్ళీ రిషి జీవితంలోకి తార ప్రవేశిస్తుంది. వారిద్దరి ప్రేమ ఈ సారి ఫలిస్తుందనేసరికి కనిపించకుండాపోయిన తులసి ఎంటర్ అవుతుంది. అసలీ తులసి ఎవరు..? రిషి జీవితంలోకి తరచు ఎందుకువస్తుంది.. వెళ్తుంది..తార,రిషి విడిపోవడానికి రిషి ఫ్రెండ్ చేసిన పొరపాటు ఏంటి అనేది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

Also Read: Bloody Beggar : డార్క్ కామెడీ ఎంటర్టైనర్.. బ్లడీ బెగ్గర్ మూవీ రివ్యూ!!

విశ్లేషణ: పలు అవాంతరాల తర్వాత విడుదలైన నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” సినిమా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. కార్ రేసింగ్ డ్రైవర్‌గా కనిపించిన నిఖిల్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ పాత్ర నిఖిల్ లోని కొత్త నటనను ఆవిష్కరించింది.మంచి స్క్రీన్‌ప్లే , ఆసక్తికరమైన కథ నిఖిల్ పాత్రను మరింత ఆసక్తిపరిచింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన దివ్యాంశ కౌశిక్ తన అందంతో ప్రేక్షకులను ఎప్పటిలాగే అలరించింది. సప్తసాగరాలు దాటి సినిమాలో చేసిన హీరోయిన్ రుక్మిణి వసంత్ మరోసారి ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రేమకథ చిత్రం కావడంతో ప్రతి ఫ్రేమ్ ను అద్భుతంగా తీర్చిదిద్దాడు.కెమెరా వర్క్‌ చాలా బాగుంది. కథలోని సన్నివేశాలకు బలం మాటలు. దర్శకుడు మాటలు బాగా రాసుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. విదేశాల్లో చేసిన షూటింగ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఈ సినిమా క్లాసీగా ఉంటుంది. సత్య, సుదర్శన్, వైవా హర్ష వంటి నటులు చేసిన కామెడీ నవ్వించింది. నిఖిల్ కెరీర్‌లో ఇది ఒక మంచి సినిమా అవుతుందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే, “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అని చెప్పాలి. కొత్త కథ, మంచి స్క్రీన్‌ప్లే, మరియు బలహీనమైన ప్రదర్శనలు ఈ సినిమాను సగటు సినిమాగా మార్చాయి. నిఖిల్ సిద్ధార్థ్ అభిమానులు ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పటికీ, వారి ఆశలు నెరవేరలేదు.

ప్లస్ పాయింట్స్:

నిఖిల్,రుక్మిణి వసంత ల కెమిస్ట్రీ

స్క్రీన్ ప్లే

ట్విస్ట్ లు

మైనస్ పాయింట్స్:

బాక్గ్రౌండ్ మ్యూజిక్

బోర్ కొట్టించే సన్నివేశాలు

తీర్పు: ప్రేమకథలు ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఫీలింగ్ ని కలిగిస్తుంది. లండన్ లోని సీనరీ, రేసింగ్ దృశ్యాలు బాగుంటాయి. నిఖిల్ కెరీర్ లో ఇది కూడా ఓ మంచి సినిమా అవుతుంది.

రేటింగ్ : 2.75/5

https://twitter.com/pakkafilmy007/status/1854915347763106161

The post Appudo Ippudo Eppudo: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! appeared first on PakkaFilmy Telugu.

]]>
https://telugu.pakkafilmy.com/nikhil-in-appudo-ippudo-eppudo-movie-review/feed/ 0 12776
EeSaraina: ప్రేక్షకులను కదిలించే “ఈ సారైనా” మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! https://telugu.pakkafilmy.com/viplav-eesaraina-movie-review/ https://telugu.pakkafilmy.com/viplav-eesaraina-movie-review/#respond Fri, 08 Nov 2024 13:35:11 +0000 https://telugu.pakkafilmy.com/?p=12752 సినిమా: ఈ సారైనా (EeSaraina)నటీనటులు: విప్లవ్, సంకీర్త్, ఆర్టిస్ట్ ప్రదీప్, అశ్విని ఆయలూరు, సాలార్ ఫేమ్ కార్తికేయ దేవ్, నటుడు మెహబూబా బాషా తదితరులుదర్శకుడు: విప్లవ్.జిసంగీతం: తేజ్డీఓపీ: గిరిఎడిటింగ్: విప్లవ్ఆర్ట్: దండు సందీప్ కుమార్నిర్మాత: విప్లవ్విడుదల తేదీ: 08 – నవంబర్ -2024 EeSaraina: విప్లవ్ ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఈసారైనా’. ఈ రోజే విడుదలైన ఈ సినిమాగ్రామీణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోగా ఈ సినిమాలో అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ […]

The post EeSaraina: ప్రేక్షకులను కదిలించే “ఈ సారైనా” మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! appeared first on PakkaFilmy Telugu.

]]>
Viplav Ee Saraina Movie Review

సినిమా: ఈ సారైనా (EeSaraina)
నటీనటులు: విప్లవ్, సంకీర్త్, ఆర్టిస్ట్ ప్రదీప్, అశ్విని ఆయలూరు, సాలార్ ఫేమ్ కార్తికేయ దేవ్, నటుడు మెహబూబా బాషా తదితరులు
దర్శకుడు: విప్లవ్.జి
సంగీతం: తేజ్
డీఓపీ: గిరి
ఎడిటింగ్: విప్లవ్
ఆర్ట్: దండు సందీప్ కుమార్
నిర్మాత: విప్లవ్
విడుదల తేదీ: 08 – నవంబర్ -2024

EeSaraina: విప్లవ్ ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఈసారైనా’. ఈ రోజే విడుదలైన ఈ సినిమాగ్రామీణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోగా ఈ సినిమాలో అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా తదితరులు నటించారు. తేజ్ సంగీతం అందించగా గిరి సినిమాటోగ్రఫీ సమకూర్చారు. దండు సందీప్ కుమార్ ఆర్ట్ డిజైన్ లో తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్, ఎమోషన్లతో ఎలా ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చూడాల్సిందే.

Viplav EeSaraina Movie Review

కథ: రాజు (విప్లవ్) డిగ్రీ పూర్తి చేసి నాలుగేళ్లు గడిచినా, ఉద్యోగం చేస్తే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి అన్నట్లుగా జీవితం సాగిస్తున్నాడు. తన ఊరిలోనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శిరీష (అశ్విని)తో ప్రేమలో పడతాడు. అయితే, మూడు సార్లు నోటిఫికేషన్ వచ్చినా రాజు ఉద్యోగం సాధించలేకపోతాడు. అయినా, రాజుని అతని స్నేహితుడు మహబూబ్ బాషా, శిరీష ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. శిరీష తండ్రి (ప్రదీప్ రాపర్తి) మాత్రం “గవర్నమెంట్ జాబ్ వస్తేనే నా కూతుర్ని నీకు ఇస్తా” అని సవాల్ విసురుతాడు. చివరికి రాజు ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన ప్రేమను గెలిచాడా? అనేదే ఈ సినిమా కథ.

Also Read: Prabhas Puri Jagannadh: పూరితో కలిసి పనిచేయనున్న ప్రభాస్.. ఏ సినిమా కోసం అంటే?

విశ్లేషణ: గవర్నమెంట్ ఉద్యోగం కోసం కష్టపడుతూనే తన ప్రేమను గెలుచుకోవాలనే తపనతో సాగే రాజు పాత్రలో విప్లవ్ అద్భుతంగా నటించారు. ఆయన నటన, ప్రతి ఒక్కరికి ఈ కథను మరింత దగ్గర చేస్తుంది. అశ్విని తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ, తన అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రదీప్ రాపర్తి, అశ్విని తండ్రి పాత్రలో, మహబూబ్ బాషా రాజు స్నేహితుడి పాత్రలో తమ నటనతో కథకు మరింత బలం చేకూర్చారు. చిన్నారులు సలార్ కార్తికేయ దేవ్, నీతు సుప్రజ తమ చిన్న పాత్రలతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటారు.

దర్శకుడు విప్లవ్, ప్రతి పాత్రను విభిన్నంగా మలచి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.హీరోగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్‌గా కూడా వ్యవహరించడం నిజంగా అభినందనీయం. ఈ చిత్రంలో గ్రామీణ జీవనం, ప్రేమ, స్నేహం, ఆశయాలు వంటి అనేక అంశాలను అద్భుతంగా కలిపి వెండితెరపై ఆవిష్కరించారు విప్లవ్. ఒక్కడే ఇన్ని బాధ్యతలు నిర్వహించి సినిమాను పూర్తి చేయడం చాలా కష్టమైన పని. దాన్ని సులువుగా చేశాడు. సినిమాటోగ్రఫీ, సంగీతం, సంభాషణలు ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. గిరి కెమెరా పనితనం, తేజ్ సంగీతం చాలా బాగున్నాయి. సినిమాలోని ప్రతి దృశ్యం కూడా చక్కగా కనిపిస్తుంది. సంగీతం కథకు మరింత బలం చేకూర్చింది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

తీర్పు: మొత్తంగా, “ఈ సారైనా” ఒక చక్కటి ప్రయత్నం. మంచి ఎమోషన్, కంటెంట్ తో ఈ సినిమా మరింత ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ప్రేమ కథలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఆస్వాదించవచ్చు. విప్లవ్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన “ఈ సారైనా” చిత్రం, ఒక ఆహ్లాదమైన ప్రేమకథను అందంగా చూపించాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ, ప్రేక్షకులను తమలో తాము తీర్చి చూసుకునేలా చేస్తుంది.

రేటింగ్: 3/5

The post EeSaraina: ప్రేక్షకులను కదిలించే “ఈ సారైనా” మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! appeared first on PakkaFilmy Telugu.

]]>
https://telugu.pakkafilmy.com/viplav-eesaraina-movie-review/feed/ 0 12752
Bloody Beggar : డార్క్ కామెడీ ఎంటర్టైనర్.. బ్లడీ బెగ్గర్ మూవీ రివ్యూ!! https://telugu.pakkafilmy.com/bloody-beggar-movie-telugu-review/ https://telugu.pakkafilmy.com/bloody-beggar-movie-telugu-review/#respond Fri, 08 Nov 2024 13:07:25 +0000 https://telugu.pakkafilmy.com/?p=12745 మూవీ : బ్లడీ బెగ్గర్ (Bloody Beggar)డైరెక్టర్: M.శివబాలన్రైటర్: M. శివబాలన్నిర్మాత: నెల్సన్నటీనటులు: కవిన్, సునీల్ సుఖద, దివ్యా, విక్రమ్, రెడీన్ కింగ్ స్లే, పృద్వీ రాజ్ తదితరులు..విడుదలతేదీ: 07- నవంబర్ – 2024 Bloody Beggar Movie Telugu Review Bloody Beggar Review: తమిళ నటుడు కవిన్, తాజాగా “బ్లడీ బెగ్గర్” చిత్రంలో బిచ్చగాడు పాత్రలో నటించారు. “బ్లడీ బేగర్” ఒక విభిన్నమైన డార్క్ కామెడీ. ఈ చిత్రం దీపావళి సందర్భంగా తమిళంలో విడుదలైంది. […]

The post Bloody Beggar : డార్క్ కామెడీ ఎంటర్టైనర్.. బ్లడీ బెగ్గర్ మూవీ రివ్యూ!! appeared first on PakkaFilmy Telugu.

]]>
Bloody Beggar Movie Telugu Review

మూవీ : బ్లడీ బెగ్గర్ (Bloody Beggar)
డైరెక్టర్: M.శివబాలన్
రైటర్: M. శివబాలన్
నిర్మాత: నెల్సన్
నటీనటులు: కవిన్, సునీల్ సుఖద, దివ్యా, విక్రమ్, రెడీన్ కింగ్ స్లే, పృద్వీ రాజ్ తదితరులు..
విడుదలతేదీ: 07- నవంబర్ – 2024

Bloody Beggar Movie Telugu Review

Bloody Beggar Review: తమిళ నటుడు కవిన్, తాజాగా “బ్లడీ బెగ్గర్” చిత్రంలో బిచ్చగాడు పాత్రలో నటించారు. “బ్లడీ బేగర్” ఒక విభిన్నమైన డార్క్ కామెడీ. ఈ చిత్రం దీపావళి సందర్భంగా తమిళంలో విడుదలైంది. అయితే, ఇప్పుడు (నవంబర్ 7) ఈ సినిమా తెలుగులోనూ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఒక వైవిధ్యమైన హారర్ కామెడీగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకులను ఈమేరకు ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం. స్టార్, దాదా లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నాడు కవిన్.

కథ: ఎంత కష్టపడినా ఫలితం దక్కదని భావించి బిక్షగాడుగా మారతాడు హీరో (కవిన్). వచ్చిన డబ్బులతో ఓ చిన్నపిల్లవాడితో కలిసి ఉంటూ బ్రతుకుతుంటాడు. అయితే ఓ రోజు ఓ పెద్ద ఇంట్లో బిచ్చగాళ్లకు భోజనాలు పెడుతున్నారని తెలిసి వెళతాడు. అక్కడ అనుకోకుండా ఇంట్లోకి వెళ్లి ఇరుక్కుపోతాడు. ఇంట్లో ఎవరు లేరన్న బిచ్చగాడికి ఆ ఇంట్లో ఓ లేడీ ఒకరిని మర్డర్ చేస్తూ కనిపిస్తుంది. అది చూసిన బిచ్చగాడు పారిపోవడానికి ప్రయత్నించి ఆ లేడీ కి దొరుకుతాడు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పదిమంది కూడా అతన్ని చంపడానికి ప్రయత్నించగా వారినుండి ఆ బిచ్చగాడు ఎలా తప్పించుకున్నాడు అనేదే సినిమా లోని మిగితా కథ.

విశ్లేషణ: బిచ్చగాడు సినిమా తమిళ్లో, తెలుగులో సూపర్ హిట్ కావడంతో ఆ నేపథ్యంతోనే వచ్చిన సినిమా బ్లడీ బెగ్గర్. ఈ సినిమాలో కవిన్ బిచ్చగాడు పాత్రతో అదరగొట్టాడు. ప్రారంభంలోనే బిచ్చగాడిగా తన పాత్ర తోప్రేక్షకులను అలరిస్తాడు. కవిన్ నటన ప్రతి సన్నివేశంలో ఎంతో ప్రత్యేకత చూపించింది. బిచ్చగాడు పాత్రలో కొన్ని సన్నివేశాలు చూస్తే మరింత ఎంటర్టైనింగ్‌గా అనిపిస్తాయి. ఆయన పాత్రకు సరిపోయే ఎంటర్టైన్మెంట్‌ అందించడం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది. ఇక చనిపోయిన నటుడి కొడుకు, కూతుళ్లు, మనవడు, మనవరాళ్లుగా నటించిన పాత్రధారులు కూడా అదరగొట్టారు. వారి నటనలోని అన్ని రకాల భావోద్వేగాలు సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. ముఖ్యంగా సునీల్ సుకంద కన్నింగ్ లాయర్ పాత్రలో నటించడం సినిమాకు హైలైట్. ఆయన కామెడీ సినిమాకు అదనపు బలం.

Also Read: Thaman: పెళ్లి ఒకరితో శోభనం మరొకరితో అంటూ సంచలన కామెంట్స్ చేసిన థమన్.?

ఒక సినిమాను ప్రేక్షకుడికి దగ్గర చేయడానికి, కథ ఎంత కొత్తగా ఉండాలో అంతకంటే ఎక్కువగా చెప్పే తీరు బాగుండాలి. ‘బ్లడీ బెగ్గర్’లో కథ ఎంతో వైవిధ్యంగా ఉంది. అంతేకాదు చాలా పాయింట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇదే దర్శకుడు నెల్సన్‌ను ఈ ప్రాజెక్ట్‌కి ఆకర్షించిన అంశం అయి ఉండొచ్చు. కథ ఎంతో ఆసక్తి సాగుతూ, ప్రధాన సన్నివేశాలకు చేరిన తర్వాతమరింత ఆసక్తిగా ఉంటుంది. సినిమాలోని ఎమోషనల్ సీన్లు ఆకట్టుకునేలా చిత్రీకరించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో కవిన్ నటన నిజంగా మెప్పించగలిగింది. కొత్త దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ పనితనంలో నెల్సన్ ప్రభావం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతీ సన్నివేశంలోనూ హీరోని క్లోజప్ షాట్లతో చూపించడం, సన్నివేశాలు తీసిన తీరే నెల్సన్ శైలిని గుర్తు చేస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్‌లో చిన్న పిల్లాడి నటన కూడా ఎంతో సహజంగా ఉంది, అది సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్ అందించిన విజువల్స్ సినిమాకు పెద్ద బలం. ఆయన అందించిన సినిమాటోగ్రఫీ సినిమా మొత్తం ఫ్రెష్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి. జెన్ మార్టిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ముఖ్యంగా, కీ సీన్లలో సంగీతం సినిమాకు బలాన్ని చేకూర్చింది.

ప్లస్ పాయింట్స్:

కవిన్ నటన

కథ, కథనాలు

సంగీతం

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు

తీర్పు: ‘బ్లడీ బెగ్గర్’ సినిమాకు మంచి కథ కథనం తో పాటు ప్రేక్షకులకు చేరవేసే విధానం కూడా బాగుంది. కవిన్ బిచ్చగాడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లు బాగా పండాయి. కొత్త ఎక్స్పీరియెన్స్ కోసం ఈ సినిమా తప్పకుండ చూడాల్సిందే.

రేటింగ్: 3/5

టాగ్ లైన్: బ్లడీ బెగ్గర్.. డార్క్ కామెడీ ఎంటర్టైనర్

The post Bloody Beggar : డార్క్ కామెడీ ఎంటర్టైనర్.. బ్లడీ బెగ్గర్ మూవీ రివ్యూ!! appeared first on PakkaFilmy Telugu.

]]>
https://telugu.pakkafilmy.com/bloody-beggar-movie-telugu-review/feed/ 0 12745
Dhoom Dhaam Movie Review: క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ధూం ధాం” మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! https://telugu.pakkafilmy.com/dhoom-dhaam-movie-review/ https://telugu.pakkafilmy.com/dhoom-dhaam-movie-review/#respond Fri, 08 Nov 2024 11:20:56 +0000 https://telugu.pakkafilmy.com/?p=12738 నటీనటులు : చేతన్ కృష్ణ, (Dhoom Dhaam Movie Review) హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులుస్టోరీ స్క్రీన్ ప్లే : గోపీ మోహన్డైరెక్టర్ : సాయి కిషోర్ మచ్చాఎడిటింగ్ : అమర్ రెడ్డి కుడుములసినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ రామస్వామిమ్యూజిక్ : గోపీ సుందర్ప్రొడ్యూసర్ : ఎంఎస్ రామ్ కుమార్విడుదల తేదీ: 08-11-2024 Dhoom Dhaam Movie […]

The post Dhoom Dhaam Movie Review: క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ధూం ధాం” మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! appeared first on PakkaFilmy Telugu.

]]>
Dhoom Dhaam Movie Review

నటీనటులు : చేతన్ కృష్ణ, (Dhoom Dhaam Movie Review) హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు
స్టోరీ స్క్రీన్ ప్లే : గోపీ మోహన్
డైరెక్టర్ : సాయి కిషోర్ మచ్చా
ఎడిటింగ్ : అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ : గోపీ సుందర్
ప్రొడ్యూసర్ : ఎంఎస్ రామ్ కుమార్
విడుదల తేదీ: 08-11-2024

Dhoom Dhaam Movie Review

Dhoom Dhaam Movie Review: చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన ‘ధూం ధాం’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ట్రైలర్‌, పోస్టర్లు ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు సాయి కిషోర్‌ మచ్చా ఈ చిత్రానికి సారథ్యం వహించగా, ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాణం చేపట్టారు. ఈ చిత్రానికి ప్రముఖ రైటర్ గోపీ మోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ: కార్తీక్ (చేతన్ కృష్ణ) కి తండ్రి (సాయి కుమార్) అంటే చాలా ఇష్టం. తండ్రికి కూడా కార్తీక్ అంటే ఇంకా ఇష్టం. ఒకరికోసం ఒకరు ఏవైనా చేస్తారు. అలాంటి వీరిమధ్య కి సుహానా (హెబ్బా పటేల్) వస్తుంది. పందెంలో గెలవడానికి సుహానా అతన్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో నిజంగానే ప్రేమలో పడుతుంది. నిజం తెలిసిన కార్తీక్ సుహానా ని అవాయిడ్ చేస్తాడు. ఒకానొక దశలో కార్తీక్ కూడా సుహానాని ప్రేమిస్తాడు. అయితే ఈ విషయం తన తండ్రికి చెప్పాలని సుహానా ప్రయత్నిస్తుండగా సుహానా తండ్రిని చుసిన కార్తీక్ గతంలో వారిద్దరిమధ్య జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల భయపడి ఆమె తండ్రిని కలవడాన్ని ఎవాయిడ్ చేస్తాడు. ఈ విషయం కార్తీక్ తన తండ్రికి చెప్పగానే అతను కూడా ఆ కుటుంబానికి చేసిన ఓ తప్పు గుర్తుకు తెచ్చుకుంటాడు. కార్తీక్ కోసం అతని తండ్రి చేసిన ఆ పెద్ద తప్పు కారణంగా సుహానా కుటుంబం ఈ సమస్యలతో ఎలా ముడిపడి పోయిందో, వారి జీవితాలను ఎలా కదిలించిందో అనేదే ఈ సినిమా కథ.

Also Read: Vaishnav Tej: శ్రీలీల కాదు.. ఆ హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ పెళ్లి..?

నటీనటులు: సినిమాలో హీరోగా చేసిన చేతన్‌ కృష్ణ తన పాత్రలో ఒదిగిపోయాడు. తన హావభావాలతో పాత్ర ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాడు. ఎమోషనల్ సీన్లలో ఇంకా కొంత అభివృద్ధి అవసరమని అనిపిస్తుంది. హీరోయిన్‌ హేబా పటేల్‌ ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత కమర్షియల్‌ హీరోయిన్‌గా మళ్లీ ప్రేక్షకులను అలరించింది. తనను స్టార్‌గా నిలబెట్టిన ప్రేమ కథల్లో మళ్లీ మెరిసిన హెబ్బా మనసుకు హత్తుకునే నటనను చూపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సాయి కుమార్‌ తండ్రి పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్‌ మరోసారి తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. తన నటన సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ముఖ్యంగా సెకండాఫ్‌లో పూర్తిగా తన భుజాలపై కథన్నితీసుకెళ్లారు. అతని కామెడీ టైమింగ్‌, హావభావాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. వీరితో పాటు గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్‌, ప్రవీణ్‌, గిరిధర్‌, నవీన్‌ కూడా తమ నటనతో అలరించారు. ప్రతి పాత్రలోని నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

సాంకేతిక నిపుణులు: సంగీత దర్శకుడు గోపీ సుందర్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలతో ఆకట్టుకోవడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని పెంచాడు. కెమెరామెన్ సిద్ధార్థ్ రామస్వామి విజువల్స్ తో ఈ సినిమాకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చాడు.అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్ ప్రతిభ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. కథలోని కొన్ని ల్యాగ్ అనిపించే సందర్భాలను కట్ చేసే విధానం, సన్నివేశాల మధ్య సరైన సింక్‌ను అందించడం సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్ ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దర్శకుడు గురించి. కథ, కథనాలు బాగా రాసుకున్నాడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. సున్నితమైన మలుపులను, భావోద్వేగాల్ని చూపించిన విధానం చాల బాగుంది. ఏదేమైనా దర్శకుడు సాయి కిషోర్ కృషి, ప్రతిభ సినిమాకి ప్రధాన బలం అయ్యాయి.

ప్లస్ పాయింట్స్ :

సంగీతం

వెన్నెల కిషోర్ కామెడీ

సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్

తీర్పు: ఇటీవల కాలంలో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలు తక్కువగా వస్తున్నాయి. యాక్షన్, రా, రస్టిక్ నేపథ్యాల కథలకు ఎక్కువ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, చాలా మంది మేకర్స్ అలాంటి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూడగల సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో, పద్దతిగా ఉన్న ప్రేమ కథలు, కుటుంబ బంధాలను, భావోద్వేగాలను ప్రదర్శించే చిత్రాల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆ లోటును భర్తీ చేయాలనే లక్ష్యంతో ‘ధూం ధాం’ సినిమా గా రాగా ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రంగా ఈ సినిమా ప్రశంశలు అందుకుంటుంది.

రేటింగ్: 3/5

టాగ్ లైన్: క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ధూం ధాం’

https://twitter.com/pakkafilmy007/status/1854846692102930680

The post Dhoom Dhaam Movie Review: క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ధూం ధాం” మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! appeared first on PakkaFilmy Telugu.

]]>
https://telugu.pakkafilmy.com/dhoom-dhaam-movie-review/feed/ 0 12738
Jithender Reddy : నక్సల్స్ అన్యాయాలను ప్రశ్నించే “జితేందర్ రెడ్డి”… మూవీ రివ్యూ & రేటింగ్!! https://telugu.pakkafilmy.com/jithender-reddy-review-and-rating/ https://telugu.pakkafilmy.com/jithender-reddy-review-and-rating/#respond Thu, 07 Nov 2024 07:21:24 +0000 https://telugu.pakkafilmy.com/?p=12600 నటీనటులు: రాకేష్ వర్రే ( Jithender Reddy ), వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ తదితరులు..దర్శకుడు: విరించి వర్మనిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డిసహ నిర్మాత: ఉమ రవీందర్ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాణిశ్రీ పొడుగుఛాయాగ్రాహకులు: వీ ఎస్ జ్ఞాన శేఖర్సంగీత దర్శకులు: గోపి సుందర్ఎడిటర్: రామకృష్ణ అర్రంపీఆర్: మధు వి ఆర్విడుదల తేదీ: 07-11 -2024 Jithender Reddy Review: A High Voltage Action Drama on Patriotism Jithender Reddy: దేశం కోసం నిస్వార్థంగా […]

The post Jithender Reddy : నక్సల్స్ అన్యాయాలను ప్రశ్నించే “జితేందర్ రెడ్డి”… మూవీ రివ్యూ & రేటింగ్!! appeared first on PakkaFilmy Telugu.

]]>
Jitender Reddy Review A High Voltage Action Drama on Patriotism

నటీనటులు: రాకేష్ వర్రే ( Jithender Reddy ), వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ తదితరులు..
దర్శకుడు: విరించి వర్మ
నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి
సహ నిర్మాత: ఉమ రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాణిశ్రీ పొడుగు
ఛాయాగ్రాహకులు: వీ ఎస్ జ్ఞాన శేఖర్
సంగీత దర్శకులు: గోపి సుందర్
ఎడిటర్: రామకృష్ణ అర్రం
పీఆర్: మధు వి ఆర్
విడుదల తేదీ: 07-11 -2024

Jithender Reddy Review: A High Voltage Action Drama on Patriotism

Jithender Reddy: దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే స్వయంసేవకుల జీవిత కథలు తెరకెక్కడం చాలా అరుదు. మన మాజీ ప్రధాన మంత్రులు అటల్ బిహారి వాజ్‌పేయి, నరేంద్ర మోదీ లు కూడా తమ ప్రస్థానాన్ని స్వయంసేవకులుగా మొదలుపెట్టి, దేశ అత్యున్నత పదవులను చేపట్టారు. అలాంటి గొప్ప నాయకులు ఎదగడంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల పాత్ర ఎన్నటికీ మరవలేనిది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కు చెందిన ఒక స్వయంసేవకుడి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘జితేంద్ర రెడ్డి’ ప్రేక్షకులను ఆసక్తిపరిచిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ: RSS భావజాలంతో పనిచేసే జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) కుటుంబం స్వయం సేవకులుగా తమదైన సేవలను అందిస్తున్నారు. దేశంకోసం ప్రాణాలు సైతం లెక్కచేయని జితేందర్ రెడ్డి నక్సల్స్ చేసే అన్యాయాలపై పోరాటం చేయడానికి చిన్నప్పుడు జరిగిన ఓ హత్య ప్రేరణ ఇస్తుంది. ప్రజలకు అండగా నిలిచే నక్సల్స్ వ్యవస్థ ఇప్పుడు ఆ ప్రజలనే తమ స్వార్ధాలకోసం పీడిస్తోందని వారిపై తిరుగుబాటు చేస్తాడు. అలా వారి ఆగ్రహానికి గురైన జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేసాడనేదే ఈ సినిమా కథ.

నటీనటులు: రాకేష్ వర్రే ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో మెయిన్ రోల్ చేయడం విశేషం. జితేందర్ రెడ్డి (Jithender Reddy) పాత్రలో జీవించాడు. ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు,చూపించిన హావభావాలు బాగున్నాయి. సినిమా కోసం ఆయన ఎంతగా కష్టపడ్డారో ప్రతి సన్నివేశంలో స్పష్టంగా తెలుస్తుంది.విద్యార్థి నాయకుడిగా,పీడీఎస్‌యూ నేత గా తన నటనతో మంచి ప్రదర్శన కనపరిచాడు. సమాజ సేవ చేసే వ్యక్తిగా ఆయన పాత్రను చాలా సహజంగా ఉంది. ప్రతినాయక పాత్రలో నక్సలైట్ లీడర్ గా ఛత్రపతి శేఖర్ నటనను కూడా అభినందించాల్సిందే. పాత్రలోని తీవ్రత సరిగ్గా మైంటైన్ చేశాడు. గోపన్న గా సుబ్బరాజు నటన చాల బాగుంది.ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించి ఆ పాత్రకు మంచి పేరు తీసుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత ఆయనకు మంచి పాత్ర ఈ సినిమా ద్వారా లభించింది. మిగిలిన నటీనటులు తమ పరిధిలో ఉన్న పాత్రలకు న్యాయం చేశారు. వారు తమ పాత్రల ద్వారా కథకు సహకరించారు.

సాంకేతిక నిపుణులు: దర్శకుడు సినిమా నుంచి మంచి మెసేజ్ ఇచ్చ్చాడు. ముఖ్యంగా డైలాగ్స్ ఎంతో పదునుగా ఉన్నాయి. “దేశం అంటే మట్టి కాదు, మనుషులు… సమాజం మనకు ఏం ఇచ్చిందని కాదుగానీ, మనం సమాజానికి ఏం ఇచ్చామనేదే ముఖ్యమని” వచ్చే డైలాగ్స్ ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉన్నాయి.సనాతన ధర్మం కోసం పోరాడే యోధుడి కథను సీరియస్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.క్లైమాక్స్ ఎమోషనల్‌గా తీసి పరిస్థి ఒక్కరితో కంటతడి పెట్టించాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ను వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. . పాటలు కొంచెం నెమ్మదిగా ఉన్నా, చివర్లో నక్సలైట్లు చేతిలో ప్రాణాలు కోల్పోయిన స్వయంసేవకుల్ని గుర్తుచేస్తూ వచ్చే పాట మాత్రం కంట తడిపెట్టేలా ఉంటుంది.నిర్మాణ విలువలు, దర్శకుడి దృక్పథం, కథా కథనాలు అన్నీ కలసి సినిమా ఒక మంచి అనుభూతిని అందిస్తాయి. ఆ కాలపు వాతావరణాన్ని ప్రామాణికంగా చూపించడంలో చిత్ర బృందం విజయం సాధించింది.

ప్లస్ పాయింట్స్:

కథ, నటీనటుల నటన

సెకండ్ హాఫ్ , క్లైమాక్స్

దర్శకత్వం

మైనస్ పాయింట్స్:

పెద్ద నటులు లేకపోవడం

ఈ సినిమా చేయడం సాహసంతో కూడిన పని అనే చెప్పాలి. స్వయంసేవకులు నిరంతరం సమా సేవలో నిమగ్నమై ఉంటే, ఈ నక్సలైట్లు ప్రగతికి పెద్ద అడ్డుగోడలా నిలుస్తున్నారు. ఈ అంశాన్ని తెరపై ఎంతో నిజాయితీతో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కథతోనే కాకుండా మనస్సుకు తగిలేలా తీర్చిదిద్దడం విశేషం..(Jithender Reddy)

రేటింగ్: 3.5/5

ట్యాగ్ లైన్: నిజమైన నాయకుడు ఎవరో చూపించే కథ

The post Jithender Reddy : నక్సల్స్ అన్యాయాలను ప్రశ్నించే “జితేందర్ రెడ్డి”… మూవీ రివ్యూ & రేటింగ్!! appeared first on PakkaFilmy Telugu.

]]>
https://telugu.pakkafilmy.com/jithender-reddy-review-and-rating/feed/ 0 12600
Ka Movie Review: ‘క’ రివ్యూ & రేటింగ్ : ట్విస్ట్ లతో ఆకట్టుకునే సస్పెన్స్ డ్రామా!! https://telugu.pakkafilmy.com/ka-movie-review-and-rating/ https://telugu.pakkafilmy.com/ka-movie-review-and-rating/#respond Thu, 31 Oct 2024 05:57:00 +0000 https://telugu.pakkafilmy.com/?p=11896 నటీనటులు : కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులు.సంగీత దర్శకుడు : సామ్ సీఎస్ (Ka Movie Review)సినిమాటోగ్రఫీ : సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్దర్శకుడు : సందీప్, సుజిత్నిర్మాతలు : చింతా గోపాల్ కృష్ణ రెడ్డివిడుదలతేదీ: 2024-10-31 కథ: అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాధ. ఓ అనాథాశ్రమంలో పెరిగిన వాసుదేవ్ కి చిన్నప్పటినుండి వేరేవారి ఉత్తరాలు చదివే అలవాటు వచ్చింది. అందువల్ల పోస్ట్ […]

The post Ka Movie Review: ‘క’ రివ్యూ & రేటింగ్ : ట్విస్ట్ లతో ఆకట్టుకునే సస్పెన్స్ డ్రామా!! appeared first on PakkaFilmy Telugu.

]]>
Ka Movie Review

నటీనటులు : కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులు.
సంగీత దర్శకుడు : సామ్ సీఎస్ (Ka Movie Review)
సినిమాటోగ్రఫీ : సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్
దర్శకుడు : సందీప్, సుజిత్
నిర్మాతలు : చింతా గోపాల్ కృష్ణ రెడ్డి
విడుదలతేదీ: 2024-10-31

కథ: అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాధ. ఓ అనాథాశ్రమంలో పెరిగిన వాసుదేవ్ కి చిన్నప్పటినుండి వేరేవారి ఉత్తరాలు చదివే అలవాటు వచ్చింది. అందువల్ల పోస్ట్ మ్యాన్ అవ్వాలనే కోరిక అతనిలో పెరిగింది. ఓ రోజు ఓ తప్పువల్ల అనాధాశ్రమం నుండి పారిపోతాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి క్రిష్ణగిరి అనే ఓ ఊరిలో అసిస్టెంట్ పోస్ట్ మాన్ గా వచ్చి జాయిన్ అవుతాడు. అక్కడే పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి సత్యభామ (నయన్ సారిక) తో ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరిలో అమ్మాయిలు మిస్ అవుతుంటారు. ఆ అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతుంటారు..దాన్ని వాసుదేవ్ ఎలా ఎలా చేధించాడు అనేదే సినిమా కథ.(Ka Movie Review)

నటీనటులు: కిరణ్ అబ్బవరం తన ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆయన విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకుని, తన పాత్ర చుట్టూ కథను అల్లుకున్న తీరు బాగుంది. పాత్ర కోసం ఆయన మేకోవర్ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. సినిమా ద్వితీయార్ధంలో కిరణ్ నటన అద్భుతంగా ఉంది. రాధ పాత్రలో తన్వీ రామ్ భావోద్వేగాలను చక్కగా పలికించారు. నయన్ సారిక పాత్ర సినిమాకు గ్లామర్ తీసుకొచ్చింది. అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్ స్లే, శరణ్య, అజయ్, బలగం జయరామ్ తమ పాత్రలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. మిగితా పాత్రధారులు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం: సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. దర్శకులు సందీప్, సుజిత్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. కథనం మరింత ఆసక్తికరంగా ఉంది. సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ లు అందించిన ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా కీలక సన్నివేశాలను, ద్వితీయార్ధంలో వచ్చే కొన్ని సన్నివేశాలను చాలా అందంగా చూపించారు. వారి కెమెరా పనితనం సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్ గా ఉంది. నిర్మాత చింతా గోపాల్ కృష్ణ రెడ్డి నిర్మాణ విలువలు సినిమాకు మరింత వన్నె తెచ్చాయి. మొత్తంగా, సాంకేతిక విభాగం సినిమాకు పెద్ద బలం.(Ka Movie Review)

ప్లస్ పాయింట్స్:

నేపథ్య సంగీతం

కిరణ్ అబ్బవరం పెర్ఫార్మన్స్

స్క్రీన్ ప్లే, ట్విస్ట్స్

మైనస్ పాయింట్స్:

ఊహించే సన్నివేశాలు

తీర్పు: ప్రారంభం నుంచే సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. విభిన్నమైన కథ, కథనంతో అందంగా సాగిన ఈ సినిమా, ఇంటర్వెల్ ట్విస్ట్‌తో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ద్వితీయార్ధంలో కథ ముందుకువెల్తూ మంచి క్లైమాక్స్‌తో ముగుస్తుంది. ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించాలనే తపనతో, కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో కూడా వినూత్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.

Tag Line: ట్విస్ట్ లతో ఆకట్టుకునే సస్పెన్స్ డ్రామా!!!

రేటింగ్: 3.5/5

The post Ka Movie Review: ‘క’ రివ్యూ & రేటింగ్ : ట్విస్ట్ లతో ఆకట్టుకునే సస్పెన్స్ డ్రామా!! appeared first on PakkaFilmy Telugu.

]]>
https://telugu.pakkafilmy.com/ka-movie-review-and-rating/feed/ 0 11896
Venom: The Last Dance: రివ్యూ అండ్ రేటింగ్!! https://telugu.pakkafilmy.com/venom-the-last-dance-review-and-rating/ https://telugu.pakkafilmy.com/venom-the-last-dance-review-and-rating/#respond Fri, 25 Oct 2024 13:53:50 +0000 https://telugu.pakkafilmy.com/?p=11496 Venom: The Last Dance: మాన్‌స్టర్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన క్రేజ్ ఉంటుంది. ఈ చిత్రాలను ఫ్రాంచైజ్‌లుగా చేసి ఒక్కో భాగాన్ని వరుసగా ప్రేక్షకులకు అందిస్తూ వస్తుంటారు నిర్మాతలు. హాలీవుడ్‌లో అలాంటి ప్రసిద్ధ మాన్‌స్టర్ చిత్రాల్లో ‘వెనొమ్’ ఒకటి. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజ్‌లో విడుదలైన రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడవ చిత్రం ‘వెనొమ్: ది లాస్ట్ డ్యాన్స్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా […]

The post Venom: The Last Dance: రివ్యూ అండ్ రేటింగ్!! appeared first on PakkaFilmy Telugu.

]]>
Venom The Last Dance Review and Rating

Venom: The Last Dance: మాన్‌స్టర్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన క్రేజ్ ఉంటుంది. ఈ చిత్రాలను ఫ్రాంచైజ్‌లుగా చేసి ఒక్కో భాగాన్ని వరుసగా ప్రేక్షకులకు అందిస్తూ వస్తుంటారు నిర్మాతలు. హాలీవుడ్‌లో అలాంటి ప్రసిద్ధ మాన్‌స్టర్ చిత్రాల్లో ‘వెనొమ్’ ఒకటి. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజ్‌లో విడుదలైన రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడవ చిత్రం ‘వెనొమ్: ది లాస్ట్ డ్యాన్స్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.

Venom: The Last Dance Review and Rating

కథ: రెండో పార్ట్ తర్వాత ఎడ్డీ (టామ్ హార్డీ) మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారతాడు. అతనికోసం ఓ వైపు పోలీసులు వెతుకుతుంటే ఇంకోవైపు వెనోమ్ కోసం తన గ్రహ వాసులు వెతుకుతుంటారు. దాంతో ఒక్కచోట ఉండకుండా పారిపోతూనే ఉంటారు. ప్రపంచాన్ని నాశనం చేయాలనే కోరికతో నల్ (ఆండీ సెర్కిస్) కూడా వీరిదగ్గర ఉన్న ఓ ఎలిమెంట్ కోసం తన అనుచరులతో వెతికిస్తుంటాడు. ఆ ఎలిమెంట్ ప్రపంచంలో వీరి దగ్గర మాత్రమే ఉంటుంది. ఇది నల్ కి దక్కకుండా ఉండాలంటే ఎడ్డీ, వెనోమ్ లలో ఎవరో ఒకరు చనిపోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం అంతం అవకుండా వారేం చేశారు. ఎవరు తమ ప్రాణాలను పణంగా పెట్టుకున్నారు. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: సూపర్ హీరో సినిమాలంటేనే యాక్షన్ సన్నివేశాలకు కొదవ ఉండదు. “వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్” కూడా ఈ విషయంలో మనల్ని నిరాశపరచదు. మొదటి నుంచి చివరి వరకు మూడు ప్రధాన యాక్షన్ బ్లాక్‌లు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ముఖ్యంగా 20 నిమిషాల నిడివి గల క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్, వెనమ్, ఇతర సింబియోట్స్ మరియు మిలటరీ కలిసి ప్రధాన విలన్‌తో చేసే యుద్ధం, ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తుంది.

అయితే, ఒక సూపర్ హీరోకి వీడ్కోలు పలుకుతున్నప్పుడు, భావోద్వేగాలు కూడా అంతే బలంగా ఉండాలి. ఈ విషయంలో “లోగన్”, “అవెంజర్స్: ఎండ్ గేమ్”, “గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3” వంటి సినిమాలు ఒక ప్రమాణంగా నిలిచాయి. “వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్”లో ఈ భావోద్వేగ బలం వాటికీ ఏమాత్రం మించిపోలేదు. ముఖ్యంగా ఎడ్డీ, వెనమ్ మధ్య హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి. క్లైమాక్స్‌లో ఒక సన్నివేశం మాత్రమే అందరి హృదయాలను టచ్ చేస్తుంది. నల్-వెనమ్ మధ్య సన్నివేశాలు లేకపోవడం నిరాశపరుస్తాయి, నల్ పాత్ర చాలా తక్కువ సమయం మాత్రమే కనిపిస్తుంది.

టెక్నికల్‌గా సినిమా అద్భుతంగా ఉంది. వీఎఫ్ఎక్స్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. డాన్ డీకన్ నేపథ్య సంగీతం బాగుంది. నటీనటుల నటన విషయానికి వస్తే, టామ్ హార్డీ తన అద్భుతమైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎడ్డీ బ్రాక్ మరియు వెనమ్ పాత్రల మధ్య తారతమ్యాన్ని అద్భుతంగా చూపించాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా చక్కగా ఉంది. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఫైనల్ గా…. సూపర్ హీరో సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా చక్కని వినోదాన్ని అందిస్తుంది.

రేటింగ్: 3/5

The post Venom: The Last Dance: రివ్యూ అండ్ రేటింగ్!! appeared first on PakkaFilmy Telugu.

]]>
https://telugu.pakkafilmy.com/venom-the-last-dance-review-and-rating/feed/ 0 11496
Narudi Brathuku Natana: నరుడి బ్రతుకు నటన మూవీ రివ్యూ!! https://telugu.pakkafilmy.com/narudi-brathuku-natana-movie-review/ https://telugu.pakkafilmy.com/narudi-brathuku-natana-movie-review/#respond Fri, 25 Oct 2024 09:16:32 +0000 https://telugu.pakkafilmy.com/?p=11462 సినిమా: Narudi Brathuku Natanaనటీనటులు: దయానంద్ రెడ్డి, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్, దయా తదితరులుఎడిటర్: బొంతల నాగేశ్వరరావుసినిమాటోగ్రఫీ: ఫహద్ అబ్దుల్ మజీద్సంగీతం: లోపేజ్నిర్మాణం: పీపుల్స్ మీడియా, టీజీ విశ్వ ప్రసాద్, సింధు రెడ్డిదర్శకత్వం : రిషికేశ్వర్ యోగివిడుదల తేది: 25-10-2024 పలు అంతర్జాతీయ వేదికల్లో అవార్డులు అందుకున్న చిత్రం “నరుడు బ్రతుకు నటన”. ఈ ప్రత్యేకమైన చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ చూసి మెచ్చి, విడుదలకు ముందుకు […]

The post Narudi Brathuku Natana: నరుడి బ్రతుకు నటన మూవీ రివ్యూ!! appeared first on PakkaFilmy Telugu.

]]>

సినిమా: Narudi Brathuku Natana
నటీనటులు: దయానంద్ రెడ్డి, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్, దయా తదితరులు
ఎడిటర్: బొంతల నాగేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: ఫహద్ అబ్దుల్ మజీద్
సంగీతం: లోపేజ్
నిర్మాణం: పీపుల్స్ మీడియా, టీజీ విశ్వ ప్రసాద్, సింధు రెడ్డి
దర్శకత్వం : రిషికేశ్వర్ యోగి
విడుదల తేది: 25-10-2024

పలు అంతర్జాతీయ వేదికల్లో అవార్డులు అందుకున్న చిత్రం “నరుడు బ్రతుకు నటన”. ఈ ప్రత్యేకమైన చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ చూసి మెచ్చి, విడుదలకు ముందుకు రావడం విశేషం. శివ కుమార్,నితిన్ ప్రసన్న,శ్రుతి జయన్,దయానంద్,వైవా రాఘవ్,ఐశ్వర్య తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ రోజు విడుదలయిన ఈ సినిమా ఏవిధంగా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

Narudi Brathuku Natana Movie Review and Rating

కథ: హీరో కావాలనే ఆకాంక్షతో సత్య (శివ కుమార్) ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ తండ్రి దగ్గరి నుంచి ప్రతి ఒక్కరు తాను యాక్టర్ గా పనికిరాడు అంటుంటారు.తల్లి లేకుండా పెరిగిన సాత్యకి మనుషుల విలువ, బంధాలు వంటివాటికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వవు. ఓ ఇన్సిడెంట్ వల్ల తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో కొచ్చిలోని ఓ గ్రామానికి చేరుతాడు. అక్కడ సల్మాన్ (నితిన్ ప్రసన్న) పరిచయమవుతాడు. ఆశ్రయం లేని సత్య కి తోడుగా ఉండి అక్కడి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. ఈ క్రమంలో మనుషులు,వీరిమధ్య ఉండే బంధాలు, ఎమోషన్స్, విలువలు తెలుసుకుని తన కల వైపు ఏవిధంగా ముందుకు సాగాడు అనేది సినిమా కథ.

నటీనటులు: శివ కుమార్, నితిన్ ప్రసన్న తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. సత్య, సల్మాన్ పాత్రల ద్వారా ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అవుతారు. శివ తన ఎమోషనల్ నటనతో ఆకట్టుకుంటాడు, నితిన్ ప్రసన్న తన గత సినిమాల్లో కనిపించిన విలనీ యాంగిల్‌ను వదిలి ఈ సినిమాలో హాస్యంతో నవ్విస్తాడు. దయానంద్ కేవలం రెండు మూడు సీన్లకే పరిమితమై చాలా ఇంపాక్ట్ చూపించాడు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ బాగా చూపించారు. లేఖ, మోనిక పాత్రలు తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటాయి. మిగతా పాత్రలు అవసరమైనప్పుడల్లా కనిపించి సినిమా పై మంచి ప్రభావాన్ని పెంచుతాయి.

సాంకేతిక నిపుణులు: ఫస్ట్ హాఫ్‌లో హీరోకు ఎమోషన్ తెలియకపోవడం, కొంచెం స్లో గా కథనం నడిపినా, సెకండాఫ్‌లో సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి. ఈవిధంగా రాసిన దర్శకుడికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ప్రతి ఒక్క విభాగాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. ఈ సినిమాలో నిర్మాత టేస్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేక్షకులకు విలువైన చిత్రాన్ని అందించాలనే పట్టుదల కనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలను టేకప్ చేసి విడుదల చేయడంలో పీపుల్స్ మీడియా మరియు టీజీ విశ్వ ప్రసాద్ టేస్ట్ ప్రశంసనీయమైనది. విజువల్స్ పరంగా కేరళ అందాల్ని మరింత అందంగా చూపించొచ్చనిపిస్తుంది. పాటలు వినసొంపుగా ఉంటాయి. ఆర్ఆర్ ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. మాటలు కొన్ని చోట్ల లోతుగా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్:

కథ, కథనం

మ్యూజిక్

ఎమోషన్స్

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ నెమ్మదించడం

తీర్పు: కథ చెప్పడం ఎంత సులువో దాన్ని తెరపై ఆవిష్కరించడం నిజంగా కష్టమైన పని. కథలో ఉన్న ఎమోషన్‌ను సరిగ్గా తీసుకురావడం, అదే ఎమోషన్‌తో ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేయడం అంత సులభం కాదు. ఈ విషయంలో నరుడి బ్రతుకు నటన సక్సెస్ అయ్యింది.

రేటింగ్: 3/5

The post Narudi Brathuku Natana: నరుడి బ్రతుకు నటన మూవీ రివ్యూ!! appeared first on PakkaFilmy Telugu.

]]>
https://telugu.pakkafilmy.com/narudi-brathuku-natana-movie-review/feed/ 0 11462
Veekshanam: వీక్షణం మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! https://telugu.pakkafilmy.com/veekshanam-movie-review-and-rating/ https://telugu.pakkafilmy.com/veekshanam-movie-review-and-rating/#respond Fri, 18 Oct 2024 06:23:47 +0000 https://telugu.pakkafilmy.com/?p=10514 సినిమా : వీక్షణం (Veekshanam)విడుదల తేదీ : 18 అక్టోబర్ 2024నటీనటులు : రామ్ కార్తీక్, కశ్వి, చిత్రం శ్రీను, నక్షత్ర నైనా.. తదితరులుదర్శకత్వం: మనోజ్ పల్లేటిసంగీతం: సమర్ద్ గొల్లపూడిసినిమాటోగ్రఫీ: సాయి రామ్ ఉదయ్ఎడిటింగ్: జెస్విన్ ప్రభునిర్మాతలు: పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి Veekshanam Movie Review And Rating రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన “వీక్షణం” సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది. పద్మనాభ సినీ ఆర్ట్స్ పతాకంపై పి. పద్మనాభ రెడ్డి, […]

The post Veekshanam: వీక్షణం మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! appeared first on PakkaFilmy Telugu.

]]>
Veekshanam Movie Review And Rating

సినిమా : వీక్షణం (Veekshanam)
విడుదల తేదీ : 18 అక్టోబర్ 2024
నటీనటులు : రామ్ కార్తీక్, కశ్వి, చిత్రం శ్రీను, నక్షత్ర నైనా.. తదితరులు
దర్శకత్వం: మనోజ్ పల్లేటి
సంగీతం: సమర్ద్ గొల్లపూడి
సినిమాటోగ్రఫీ: సాయి రామ్ ఉదయ్
ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
నిర్మాతలు: పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి

Veekshanam Movie Review And Rating

రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన “వీక్షణం” సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది. పద్మనాభ సినీ ఆర్ట్స్ పతాకంపై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని టీజర్, ట్రైలర్‌తోనే అంచనాలు పెంచారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం.

కథ: హైదరాబాదులో ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే అర్విన్ (రామ్ కార్తిక్)కు బైనాకులర్స్ తో తన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకునే అలవాటు ఉంటుంది. తన స్నేహితుడితో కలిసి అలా చూస్తున్న సమయంలోనే అతనికి నేహ(కశ్వి ) మీద ప్రేమ పుడుతుంది. ఆమెను ప్రేమలో పడేసేందుకు తన స్నేహితుడి సహాయంతో అనేక ప్రయత్నాలు చేయగా చివరికి ఆ ప్రయత్నాలు ఫలించి ఆమె ప్రేమలో పడుతుంది. ఆమెతో గొడవ అయిన సమయంలో మరో ఇంటిని అలాగే పరిశీలిస్తుండగా ఒక అమ్మాయి రోజుకు ఒక వ్యక్తిని ఇంటికి తీసుకురావడం గమనిస్తాడు. ముందు పెద్దగా సీరియస్గా తీసుకోడు కానీ ఆ అమ్మాయి ఏదో పెద్ద క్రైమ్ చేస్తుందని భావించి ఆమె మీద ఫోకస్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె హత్యలు చేస్తుందని తెలిసి ఆమెను ట్రేస్ చేసే ప్రయత్నం చేయగా ఆమె చనిపోయి ఎనిమిది నెలలు అయిందని తెలుస్తుంది. అయితే చనిపోయి ఎనిమిది నెలలు అయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుంది? ఆర్విన్ తన స్నేహితుడు ఛీ ఛీ, బావమరిది(షైనింగ్ ఫణి)తో కలిసి చూసింది నిజమేనా? అసలు ఆ హత్యలు చేసేది ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నారు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు: నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరో రామ్ కార్తీక్ పక్కింటి విషయాలపై ఆసక్తి చూపించే సాధారణ యువకుడిగా పాత్రలో ఒదిగిపోయి, సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కశ్వి గ్లామర్ మాత్రమే కాకుండా తన అభినయంతో కూడా మెప్పించింది. బాలనటిగా నిరూపించుకున్న తన ప్రతిభను ఈ సినిమాలోనూ బాగా చూపించింది. చనిపోయిన అమ్మాయిగా కీలక పాత్రలో నటించిన బిందు నూతక్కి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కదిలించింది. షైనింగ్ ఫణి తన కామెడీ టైమింగ్‌తో మంచి నవ్వులు పూయించాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు సమర్థవంతంగా నటించారు.

సాంకేతికనిపుణులు: “వీక్షణం” సినిమాను టెక్నికల్‌గా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి కీలక పాత్ర పోషించారు. థ్రిల్లర్ సినిమాలకు బలంగా నిలిచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అద్భుతంగా సమకూర్చి, సినిమాను మరింత ఆసక్తికరంగా మలిచారు. సిద్ శ్రీరామ్ పాడిన “ఎన్నెన్నెన్నో” పాటతో పాటు, “వీక్షణ”లోని ఇతర పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తన రెండవ చిత్రానికే సమర్థ్ గొల్లపూడి సంగీతంలో ఉన్న పరిపక్వత స్పష్టంగా కనిపించింది. రామ్ కార్తీక్ ఈ సినిమాకు హీరో అయినా, టెక్నికల్‌గా మాత్రం సమర్థ్ గొల్లపూడి నిజమైన హీరో అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్‌ను అద్భుతంగా ప్రతిబింబించింది. ముఖ్యంగా థ్రిల్లింగ్ సన్నివేశాల చిత్రీకరణలో కెమెరామెన్ ప్రతిభ గోచరించింది. ఫైట్స్ కూడా సృజనాత్మకంగా డిజైన్ చేయబడ్డాయి. నిర్మాణ విలువలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి.

విశ్లేషణ: “ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని మన పని మనం చూసుకోవడం” అన్న విక్టరీ వెంకటేష్ మాటలే ఈ సినిమాకు ప్రేరణగా మారాయని దర్శకుడు మనోజ్ తెలిపారు. ఆ మాటకు అనుగుణంగా, ఇతరుల జీవితాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కారణంగా హీరో ఎదుర్కొనే సమస్యలను, వాటిని అధిగమించే ప్రయత్నాన్ని దర్శకుడు చాలా సుకుమారంగా చిత్రీకరించారు. ఇక సెకండ్ హాఫ్‌లో చనిపోయిన ఆ అమ్మాయి హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొనే ప్రయత్నం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్ కూడా పరిపాటీకి భిన్నంగా, రెండవ భాగానికి లీడ్ ఇచ్చే విధంగా ఉంటుంది. మొదటి సినిమా అయినప్పటికీ, దర్శకుడు ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను తీర్చిదిద్దడం అభినందనీయం. సమాజంలో ఉన్న ఒక సమస్యను స్పృశిస్తూనే క్లిష్టమైన కథనాన్ని సున్నితంగా చెప్పడంలో ఆయన విజయం సాధించారు.

తీర్పు: ప్రతి సన్నివేశంలో సస్పెన్స్‌ను చక్కగా కొనసాగిస్తూ, కథను ప్రేక్షకుల ఊహకు అందకుండా నడిపించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో హీరో-హీరోయిన్ మధ్య ప్రేమ, వారి గొడవలు, అలాగే మరో అమ్మాయి హత్యను చూడటం వంటి పరిణామాలు ఇంటర్వెల్ బ్లాక్‌ను ఉత్కంఠగా ముగిస్తాయి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు తప్పకుండ చూడాల్సిన సినిమా ఇది.

రేటింగ్:3.5/5

The post Veekshanam: వీక్షణం మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! appeared first on PakkaFilmy Telugu.

]]>
https://telugu.pakkafilmy.com/veekshanam-movie-review-and-rating/feed/ 0 10514